Navdeep : స్టేజ్ మీద నవదీప్ పరువు తీసేసిన బాలయ్య.. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికావు అంటూ?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 1షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇప్పటికే మొదటి సీజన్ ని విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు తెలుగు ఇండియన్ ఐడల్ 2 ని విజయవంతం చేసే పనిలోపడ్డారు.

 Balakrishna Navdeep Funny Moment In Indian Idol 2 Latest Promo Video Went Viral-TeluguStop.com

ఈ క్రమంలో షో నిర్వాహకులు ఈ షోకి మొదటి నుంచి భారీ హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.ఇందులో భాగంగానే ఇప్పటివరకు జరిగిన ఆడిషన్స్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్నాయి.

జవాన్ చక్రపాణి, అమెరికాలో డాక్టర్ వృత్తి చేపడుతున్న శృతి నండూరిని తీసుకు వచ్చారు.

ఇక తాజాగా ఈ షోకి హీరో బాలకృష్ణ( Balakrishna ) స్పెషల్ గెస్ట్ గా వచ్చి రచ్చ రచ్చ చేసాడు.అంతే కాకుండా ఈ షోలో నవదీప్, బాలకృషల మధ్య మధ్య ఫన్నీ సన్నివేశాలు కూడా జరిగాయి.ఇకపోతే ఈ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2( Telugu Indian Idol 2 )షో ఓటీటీ సంస్థ ఆహాలో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే.

ఈ షో సీజన్ 2 లో మ్యూజిక్ డైరెక్టర్ థమన్, సింగర్లు కార్తిక్, గీతా మాధురి ఈ షోకి జడ్జీలుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే తాజాగా ఈ షోకి సంబంధించి ప్రోమోని విడుదల చేశారు మేకర్స్.

ఇందులో బాలయ్యని స్పెషల్ గెస్టుగా ఆహ్వానించగా హీరో నవదీప్( Navdeep ) , బిందు మాధవి తమ కొత్త వెబ్ సిరీస్ న్యూసెన్స్ ప్రమోషన్ కోసం వచ్చారు.

ఆ తర్వాత బాలయ్య, నవదీప్ ని ఉద్దేశిస్తూ.ఆదివారం టీవీ ఆన్ చేస్తే.శనివారం డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన నవదీప్, కారు వదిలి పారిపోయిన నవదీప్ అంటూ ఒకటే రచ్చ అంటూ బాలయ్య నవ్వుతూనే నవదీప్ పరువు తీసేశారు.

దాంతో అక్కడ ఉన్నవారంతా నవ్వు కున్నారు.ఇక ప్రోమో మొత్తం బాలయ్య బాబు తన పంచులతో అందరిని కడుపుబ్బ నవ్వించారు.ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో బాలయ్య బాబు ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు.ఒకవైపు సినిమాలు,టాక్ షోలు, మరోవైపు రాజకీయాలు, కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు బాలయ్య బాబు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube