నందమూరి నటసింహం బాలకృష్ణ( Balakrishna ) త్వరలోనే భగవంత్ కేసరి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ సినిమా అక్టోబర్ 19వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.
అయితే ఈ మధ్యకాలంలో బాలయ్య నటిస్తున్న సినిమాలన్నింటికీ కూడా మంచి ఆదరణ రావడమే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా మంచి లాభాలను అందుకుంటున్నారు.ఈ క్రమంలోనే గత చివరి ఐదు సినిమాలలో బాలకృష్ణ ఎంత మొత్తంలో లాభాలను అందుకున్నారు ? ఏ సినిమా ఎంత మొత్తంలో కలెక్షన్స్ రాబట్టింది అనే విషయానికి వస్తే…

బాలకృష్ణ ఈ ఏడాది మొదట్లో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చినటువంటి వీరసింహారెడ్డి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ సినిమా 73 కోట్లతో ఫ్రీ రిలీజ్ బిజినెస్( Veera Simha Reddy Pre Release Business ) జరుపుకోగా 80 కోట్ల షేర్స్ రాబట్టింది దీంతో ఏకంగా ఆరు కోట్ల లాభాలను అందుకుంది.
బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చినటువంటి అఖండ సినిమా( Akhanda Movie ) ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.కరోనా సమయంలో కూడా ఈ సినిమా భారీ స్థాయిలోనే ప్రేక్షకులను ఆకట్టుకునీ కలెక్షన్స్ రాబట్టింది.ఇక ఈ సినిమా రూ.53.25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.రూ.54 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా రూ.75.10 కోట్ల షేర్ కాబట్టి భారీ లాభాలను అందుకుంది.

నందమూరి బాలకృష్ణ హీరోగా కెఎస్ రవికుమార్ తెరకెక్కించిన సినిమా రూలర్ మూవీ రూ.21 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.రూ.22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా రూ.10.05 కోట్ల షేర్ రాబట్టి డిజాస్టర్ గా నిలిచింది.బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా 51 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది అయితే ఈ సినిమా కేవలం ఐదు కోట్ల షేర్స్ రాబట్టి నిర్మాతలకు 46 కోట్ల వరకు నష్టాలను తీసుకువచ్చిందని చెప్పాలి.
ఇక తాజాగా ఎన్నో అంచనాల నడుమ బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.







