తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు( Telangana Assembly Elections ) నగారా మోగిన సంగతి తెలిసిందే.నవంబర్ 30న ఇక్కడ పోలింగ్ జరగనుండగా.
డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు.ఒకే విడతలో ఇక్కడ ఓటింగ్ నిర్వహించనున్నారు.
నెలన్నర క్రితమే సీఎం కేసీఆర్( CM KCR ) ఒకేసారి 115 మంది అభ్యర్ధుల జాబితాను ప్రకటించి విపక్షాలను డైలామాలో పడేశారు.బీఆర్ఎస్ అభ్యర్ధులు ఇప్పటికే తొలి రౌండ్ ప్రచారం పూర్తి చేసి.
మంచి దూకుడు మీదున్నారు.ఆదివారం కాంగ్రెస్( Congress ) 55 మందితో తన తొలి జాబితా ప్రకటించింది.
బీజేపీ( BJP ) మాత్రం ఇంకా అభ్యర్ధుల వడపోత దగ్గరే వుంది.అయితే జాబితాలో చోటు దక్కని అసంతృప్తులు ఆయా పార్టీలకు రాజీనామా చేసి.
తమకు టిక్కెట్ ఇచ్చే పార్టీల్లోకి జంప్ అవుతున్నారు.మొత్తంగా తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఇలా వుంది.

ఇదిలావుండగా.రాష్ట్రంలో ఎన్నికల కసరత్తుపై అక్టోబర్ తొలివారంలో కేంద్ర ఎన్నికల సంఘం సమీక్షించిన సంగతి తెలసిందే.ఈ సందర్భంగా ఎన్నికల ఏర్పాట్లపై సీఈసీ రాజీవ్ కుమార్( CEC Rajiv Kumar ) కీలక సూచనలు చేశారు.తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య 3.06 కోట్లకు చేరిందని సీఈసీ ప్రకటించింది.అందులో పురుషుల సంఖ్య 1.53 కోట్లు, మహిళల సంఖ్య 1.52 కోట్లు, ఇతరులు 2,133 మంది వున్నారు.తెలంగాణలో మొత్తం 35,356 పోలింగ్ కేంద్రాలు వున్నాయి.

కాగా.ఎక్కడో విదేశాల్లో వున్న ప్రవాస భారతీయులు సైతం సొంత దేశంలో జరిగే ఎన్నికల్లో పోటీ చేయడంతో పాటు ఓటు వేయాలని ఉవ్విళ్లూరుతున్నారు.తెలంగాణకు చెందిన పలువురు ఎన్ఆర్ఐలు( NRIs ) కూడా రాష్ట్రంలో ఓటు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
పెరిగిన ఎన్ఆర్ఐ ఓటర్ల సంఖ్యే అందుకు నిదర్శనం .తెలంగాణలో 2014లో ఎన్ఆర్ఐ ఓటర్ల సంఖ్య 5 కాగా.2018కి అది 244కి, 2023కి అది ఏకంగా 2,780కి చేరిందంటే పరిస్ధితి అర్ధం చేసుకోవచ్చు.ఎన్ఆర్ఐ ఓటర్లలో 2,248 మంది పురుషులు, 531 మంది మహిళలు, ఒక ట్రాన్స్‌జెండర్ వున్నారు.
తెలంగాణలోని 119 నియోజకవర్గాలకు గాను ఒక్క మల్కాజిగిరిలోనే 206 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు( NRI Voters ) వున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.ఆ తర్వాత ఉప్పల్ 131, కూకట్‌పల్లిలో 102 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు వున్నారు.
పోలింగ్ రోజున ఒరిజినల్ పాస్‌పోర్ట్‌ను చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని ఈసీ తెలిపింది.







