బాలయ్య 109 వ సినిమా ఇంతకీ ఏ స్టార్ డైరెక్టర్ తో ఆ లక్కీ ఛాన్స్ ఎవరికి ? పోటీపడుతున్న ముగ్గరు స్టార్ డైరెక్టర్స్ పవర్ ఫుల్ కంటెంట్ ,మాస్ ఎలిమెంట్స్ , పవర్ ఫుల్ డైలాగ్స్ ,డాన్స్ లో ఆ ఈజ్ ,ఫైట్స్ , సిస్టర్ సెంటిమెంట్ సీన్స్ , యాక్షన్ సీన్స్ ,రాయలసీమ బ్యాక్ డ్రాప్ , ఫ్యాక్షన్ సినిమాలు , చేసి ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగ రాయాలన్న ఒక నందమూరి బాలకృష్ణ కె సొంతం అని పలు సందర్భాల్లో బాలయ్య తో సినిమా చేసిన డైరెక్టర్స్ తెలిపారు .మరి ముఖ్యంగా బాలయ్యకు ప్రేక్షకుల్లో మాస్ ఇమేజ్ ,క్రేజ్ బాగా ఉంది .
ఇక సింహా సిమిమా తో మొదలైన సక్సెస్ జోరు వీరసింహారెడ్డి సినిమా వరకు కంటిన్యూ అవుతుంది .

ఇక అసలు విషయానికి వస్తే బాలయ్య తో సినిమా అంటే ఖచ్చితంగా మాస్ ఎలిమెంట్స్ , మాస్ పల్స్ పట్టుకునే డైరెక్టర్స్ ఉంటే ఆ సినిమా గ్యారెంటీ గా ఇండస్ట్రీ హిట్.ఇక ఈ విషయం డైరెక్టర్ బోయపాటి శ్రీను కి బాగా తెలుసు ,బాలయ్య ను స్క్రీన్ మీద ఎలా చూపిస్తే ప్రేక్షకులు కనెక్ట అవుతారు డైలాగ్స్ , మ్యానరిజమ్స్ ,లుక్ ఇలా అన్ని టి లో జాగ్రత్తలు తీసుకొని సింహా సినిమా తెరక్కించి బాలయ్యకు ఇండస్ట్రీ హిట్ అందించారు .సింహా సక్సెస్ తో వీరిద్దరి కాంబినేషన్ కు ప్రేక్షకులు బాగా ఆదరించారు .మల్లి వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మరొక సినిమా లెజెండ్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఇక బోయాపాటి శ్రీను బాలయ్య కాంబినేషన్ లో సినిమా అనగానే బాలయ్య అభిమానుల్లో భారీ అంచానాలు ఉంటాయి .వీరిద్దరి కాంబినేషన లో హ్యాట్రిక్ గా సినిమా ఎనౌన్స్ చేయగానే ఈ సారి డైరెక్టర్ బోయపాటి శ్రీను బాలయ్యను ఎలా చూపిస్తారో ,అనే అంచానాలు బాగా పెరిగాయి .ఫైనల్ గా బోయపాటి శ్రీను బాలయ్యను అఘోరా గా చూపించి బలమైన కంటెంట్ మాస్ ఎలిమెంట్స్ ,పవర్ ఫుల్ డైలాగ్స్ .డ్యూయల్ రోల్ లో బాలయ్యను అఖండ సినిమాలో పవర్ ఫుల్ గా ప్రెజెంట్ చేసి బలకృష్ణ కు హ్యాట్రిక్ హిట్ అందించారు.
బాలయ్య తో సినిమా చేసే అవకాశం వస్తే ఏ డైరెక్టర్ వదులుకోరు .ఇక క్రాక్ సినిమా తో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ గోపీచంద్ మలినేని , బాలయ్యకు వీరాభిమాని , క్రాక్ సినిమా తరువాత డైరెక్టర్ గోపీచంద్ మలినేని బాలకృష్ణతో సినిమా ఎనౌన్స్ చేయగానే అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి .గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన వీరసింహారెడ్డిసినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది .ఈ సినిమా ట్రైలర్స్ ,టీజర్స్ , సాంగ్స్ , బాలయ్య యాక్టింగ్ ,ఎస్.ఎస్.తమన్ మ్యూజిక్ ,డైరెక్టర్ గోపీచంద్ టేకింగ్ ,యాక్షన్ సీన్స్ , సెంటిమెంట్ సీన్స్ ఇలా అన్ని అంశాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని ఇండస్ట్రీ హిట్ అందుకుంది .
ఇక మెయిన్ మ్యాటర్ లో కి వెళ్ళితే .ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు.ఇప్పటికే అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో వరుస విజయాలను అందుకున్నారు.ఇక వీరసింహారెడ్డి సినిమా తరువాత బాలకృష్ణ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే .ఈ సినిమా తరువాత బాలకృష్ణ ఏ డైరెక్టర్ లో సినిమాలు లైన అప్ లో ఉన్నాయి అనే డిస్కషన్ నడుస్తుంది .మరి బాలయ్య అనిల్ రావిపూడి సినిమా తర్వాత ముగ్గురు స్టార్ డైరెక్టర్స్ బాలయ్య తో సినిమా చేయడానికి రెడీ గా ఉన్నారు మరి ఇంతకీ ఆ డైరెక్టర్స్ ఎవరు ? వీరిలో మొదటగా డైరెక్టర్ పూరి జగన్నాధ్ పేరు ముందు వరుస లో ఉంది.

డైరెక్టర్ పూరీ జగన్నాథ్ బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన పైసా వసూల్ సినిమా సూపర్ హిట్ అయింది వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా కోసం బాలయ్య అభిమానులు ఎదురుచూస్తున్నారు అలానే బాలయ్యతో మల్లి మాస్ సినిమా చెయ్యాలని డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పవర్ ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది .

ఇక రెండొవ వరుస లో మరో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో అఖండ సినిమాకు సీక్వెల్ ఉండబోతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి .ఇక మూడవ వరుస లో బాలయ్యతో గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా చేసిన క్రిష్ దర్శకత్వంలో కూడా సినిమా ఉండే అవకాశం ఉందని న్యూస్ వినిపిస్తుంది .మరి ఇంతకీ బాలకృష్ణ అనిల్ రావిపూడి తో సినిమా పూర్తి కాగానే ఈ ముగ్గురి స్థార్ డైరెక్టర్స్ లో ఏ డైరెక్టర్ తో సినిమా ఎనౌన్స్ చేస్తారో అనే విషయం మీద క్లారిటీ రావాలి అంటే మరి కొద్దీ రోజులు ఆగాలసిందే .