ఏపీ అధికార పార్టీ వైసీపీకి వరుస వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.ఇప్పటికే కొంతమంది పార్టీ ఎమ్మెల్యేలు రెబల్ గా మారారు.
వారంతా టిడిపిలోకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటూ ఉండగా, ఇప్పుడు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ జనసేనలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి.దీనికి కారణం ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు ఫ్లెక్సీలే కారణం.
ప్రస్తుతం ఆమంచి కృష్ణమోహన్ పర్చూరు వైసీపీ ఇన్చార్జిగా ఉన్నారు .ఆయన వచ్చే ఎన్నికల్లో చీరల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు .కానీ ఆ సీటు కృష్ణమోహన్ కు దక్కే అవకాశం లేకపోవడంతో, గత కొంతకాలం నుంచి ఆయన అసంతృప్తితో ఉంటున్నారు.ఇది ఇలా ఉంటే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు స్వాములు జనసేన లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
జనసేన నేతగా చీరాల నియోజకవర్గంలో భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి.
ప్రస్తుతం ఆమంచి కృష్ణమోహన్ తో పాటు, ఆయన సాధరుడు స్వాములు వైసీపీలోనే కొనసాగుతున్నారు.దీంతో ఇప్పుడు జనసేన ఫ్లెక్సీల్లో ఆమంచి స్వాములు ఫోటోలు కనిపించడం రాజకీయంగా సంచలనం రేగుతోంది.ఆ ఫ్లెక్సీల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆ వెనుక ఆమంచి స్వాములు ఫోటోలతో పాటు నాదెండ్ల మనోహర్, నాగబాబు ఫోటోలు ఉన్నాయి.
అయితే ఈ ఫ్లెక్సీలతో తమకు ఎటువంటి సంబంధం లేదని ఆమంచి వర్గీయులు చెబుతున్నా, ఈ ఫ్లెక్సీలు ఇంకా తొలగించకపోవడంతో ఆమంచి బ్రదర్స్ జనసేన లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఆమంచి స్వాములు ముందుగా జనసేనలో చేరుతారని, ఆ తర్వాత పరిస్థితులను బట్టి కృష్ణమోహన్ కూడా వెళ్లే ఛాన్స్ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది.ఎందుకంటే ఆమంచి కృష్ణమోహన్ చెప్పినట్లుగానే స్వాములు నడుచుకుంటూ ఉంటారు. దీంతో స్వాములు పేరుతో జనసేన ఫ్లెక్సీలు ఏర్పాటు కావడం వెనుక కృష్ణమోహన్ ఉన్నారనే అనుమానాలు మొదలయ్యాయి.
ఈ ఫ్లెక్సీలు బాపట్ల జిల్లాలోని వేటపాలెం మండలం పందిళ్ళపల్లిలో ఏర్పాటు అయ్యాయి.జనసేన పార్టీ మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఈ ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి.