స్టార్ హీరో బాలకృష్ణ 100కు పైగా సినిమాలలో నటించి విజయాలను అందుకున్న హీరోలలో ఒకరనే సంగతి తెలిసిందే.బాలయ్య నటించిన అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సంచలనాలను సృష్టించిందో ప్రేక్షకులు మరిచిపోలేరు.
బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీ దసరాకు రిలీజ్ అవుతుందని ప్రచారం జరిగినా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా క్రిస్మస్ కానుకగా థియేటర్లలో రిలీజ్ కానుంది.
బాలయ్య భార్య పేరు వసుంధర అనే సంగతి తెలిసిందే.
సీనియర్ ఎన్టీఆర్ కొడుకైన బాలకృష్ణ తన సినీ కెరీర్ లో అన్ని రకాల పాత్రల్లో నటించి మెప్పించారు.వసుంధర సొంతూరు కాకినాడ కాగా ఈ ప్రాంతంలో బాలయ్య నటించిన రామ్ రహీమ్ షూటింగ్ జరిగింది.
ఈ సినిమాలోని ఒక సన్నివేశంలో బాలయ్య రిక్షా తొక్కుతూ కనిపించారు.వసుంధర తల్లి బాలయ్యను అలా చూసి షాకయ్యారని బోగట్టా.
సీనియర్ ఎన్టీఆర్ కొడుకై ఉండి బాలయ్య రిక్షా తొక్కడం ఏమిటని ఆమె ప్రశ్నించగా ఆ మాట విని బాలయ్య సరదాగా నవ్వారని తెలుస్తోంది.సినిమాలలో నటించాలంటే అన్ని రకాల పాత్రలలో నటించి మెప్పించాలనే సంగతి తెలిసిందే.
సీనియర్ ఎన్టీఆర్ కూడా తన సినీ కెరీర్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించి ప్రేక్షకుల ప్రశంసలను అందుకున్నారనే సంగతి తెలిసిందే.
వసుంధర బాలయ్య సినిమా వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోయినా పిల్లల పెంపకంలో కీలక పాత్ర పోషించారు.బాలయ్య కొడుకు మోక్షజ్ఞ త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.అయితే బాలయ్య కొడుకు సినిమాకు ఎవరు దర్శకుడిగా వ్యవహరిస్తారో తెలియాల్సి ఉంది.
బాలయ్య తర్వాత ప్రాజెక్ట్ లపై మంచి అంచనాలు నెలకొన్నాయి. రాజమౌళి, సుకుమార్, పూరీ జగన్నాథ్, ప్రశాంత్ నీల్ లాంటి స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాతో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.