రూ.100 కోట్ల పారితోషికం తీసుకుంటున్న హీరో విజయ్ మొదటి సినిమా సంపాదన తెలిస్తే షాక్?

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్. తమిళ ప్రేక్షకులే కాకుండా తెలుగు ప్రేక్షకులకు కూడా మంచి అభిమాన హీరోగా నిలిచాడు.

 Hero Vijay Taking 100 Crore Remuneration Would Be Shocked To Know His First Film-TeluguStop.com

బాలనటుడుగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన విజయ్ ఆ తర్వాత తన తొలి సినిమాతోనే యాక్షన్ హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హోదాను సంపాదించుకున్నాడు.

ప్రస్తుతం ఈయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.ఇదిలా ఉంటే ఈయన మొదటి సంపాదన ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

ఇంతకు అది ఎంతనో తెలుసుకుందాం.

విజయ్ ఫ్యామిలీ విషయానికి వస్తే ఆయన తండ్రి ఎస్ ఏ చంద్రశేఖర్.

ఈయన దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆయన తల్లి శోభ. ఈమె సినీ గాయని, రచయిత.ఇక విజయ్ తొలిసారిగా 1984లో తన తండ్రి దర్శకత్వంలో రూపొందిన ‘వెట్రి’ సినిమాలో బాల నటుడుగా నటించాడు.

ఆ తర్వాత వరుసగా చాలా సినిమాలలో నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

ఈయన 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఒక సినిమాలో నటించగా ఆ సినిమాలో తన ఎక్స్ప్రెషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో ఆయన చాలా అవమానాలు ఎదుర్కొన్నాడని.

పైగా సినిమాలలో పనికిరాడు అని తేల్చి చెప్పేశారట.కానీ తన సహనాన్ని కోల్పోకుండా మళ్లీ ముందుకు అడుగు వేసి హీరోగా మంచి సక్సెస్ తో ఎదిగాడు.

ఇక హీరోగా అడుగు పెట్టిన తర్వాత ఈయన క్రేజ్ మొత్తం మారిపోయింది.

Telugu Adirindi, Vijay, Kollywood, Master, Sarkaar, Vijay Vetri-Movie

తన నటనతో మంచి సక్సెస్ అందుకొని పలు అవార్డులు కూడా సొంతం చేసుకున్నాడు.సర్కార్, అదిరింది, పోలీస్, స్నేహితుడు, మాస్టర్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకొని తెలుగు వారిని కూడా అభిమానులుగా మార్చుకున్నాడు.నిజానికి ఈయన ఏ సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సొంతం చేసుకుంటాయి.

తమిళ సినీ ఇండస్ట్రీలో రజినీకాంత్, కమలహాసన్ స్టార్ హీరోలుగా కొనసాగుతున్న సమయంలోనే విజయ్ కూడా స్టార్ హీరోగా ఎదిగి వారి కంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నాడు.పైగా రెమ్యునరేషన్ విషయంలో కూడా ఆయన అందరి కంటే ముందు లైన్ లో ఉన్నాడు.

ప్రస్తుతం ఆయన రెమ్యూనరేషన్ దాదాపు 90 కోట్ల నుండి వంద కోట్ల మధ్యలో ఉంటుందని తెలిసింది.

Telugu Adirindi, Vijay, Kollywood, Master, Sarkaar, Vijay Vetri-Movie

కానీ కెరీర్ మొదట్లో తన మొదటి పారితోషకం తెలిస్తే మాత్రం షాక్ అవ్వకుండా ఉండలేరు.విజయ్ బాలనటుడిగా వెట్రి సినిమాలో నటించగా ఆ సమయంలో ఆయన పదేళ్ల వయసులో ఉన్నాడు.ఇక ఆ సినిమాకు విజయ్ మొదటగా రూ.500 ల పారితోషకం అందుకున్నాడు.

ఇక ఈయన ఇంత పారితోషికం అందుకున్నాడు అంటే అందరూ షాక్ అవుతున్నారు.

అంత పారితోషికం నుండి ఇప్పుడు వందల కోట్ల వరకు వచ్చాడు అంటే మామూలు విషయం కాదు అని ఆయన అభిమానులు తెగ పొగుడుతున్నారు.ఇదిలా ఉంటే ఈరోజు ఈయన పుట్టినరోజు సందర్భంగా.

ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube