టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో బోయపాటి శ్రీను ఒకరు.ఒకవైపు సీనియర్ హీరోలతో సినిమాలను తెరకెక్కిస్తూ మరోవైపు యంగ్ హీరోలతో కూడా సినిమాలు తీస్తున్న బోయపాటి శ్రీను ప్రస్తుతం హీరో బాలకృష్ణతో అఖండ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు.
నిన్న ఈ సినిమా సెకండ్ టీజర్ రిలీజ్ కాగా ఆ టీజర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.ఈ టీజర్ కు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.
సింహా, లెజెండ్ సినిమాల తరువాత బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అఖండ ఆ సినిమాలను మించి హిట్ అవుతుందని బాలయ్య ఫ్యాన్స్ భావిస్తున్నారు.అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో మాత్రం బాలకృష్ణ ఫ్యాన్స్ సంతృప్తిగా లేరని తెలుస్తోంది.
ఈ సినిమాకు మొదట మోనార్క్, గాడ్ ఫాదర్ మరికొన్ని టైటిల్స్ వినిపించాయి.ఈ టైటిల్స్ కాకపోయినా బాలకృష్ణ సినిమాకు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ టైటిల్ పెట్టి ఉంటాడని బాలకృష్ణ ఫ్యాన్స్ భావించారు.
అయితే అఖండ టైటిల్ మాత్రం బాలయ్య ఫ్యాన్స్ ను నిరుత్సాహానికి గురి చేస్తోంది.బాలయ్య రెండు టీజర్లలో చెప్పిన డైలాగులు సైతం ఏపీలోని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేను ఉద్దేశించి చెప్పిన డైలాగులు అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఈ సినిమాలో బాలకృష్ణ రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తుండగా ఒక పాత్రలో అఘోరాగా కనిపించనున్నారు.ప్రగ్యా జైస్వాల్, పూర్ణ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.