అక్కినేనిపై చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు బాలకృష్ణ స్పందించారు.అక్కినేనిని కించపరిచేలా తాను మాట్లాడలేదన్నారు.
యాదృచ్ఛికంగా అన్న మాటలే తప్ప కావాలని అనలేదని తెలిపారు.అక్కినేని నాగేశ్వర రావును బాబాయ్ అని పిలిచేవాడినని చెప్పారు.
బాబాయ్ పై ప్రేమ తన గుండెల్లో ఉంటుందని పేర్కొన్నారు.తన పిల్లల కంటే ఎక్కువగా తనపై ప్రేమ చూపేవారని వెల్లడించారు.
పొగడ్తలకు పొంగి పోకూడదని అక్కినేని నుంచే నేర్చుకున్నానని బాలయ్య తెలిపారు.ఎన్టీఆర్, ఏఎన్నార్ చిత్ర పరిశ్రమకు రెండు కళ్లు అని వ్యాఖ్యనించారు.







