ఆదిత్య 369 సీక్వెల్ గురించి క్లారిటీ ఇచ్చేసిన బాలయ్య.. ఆ విషయంలో డౌట్స్ అక్కర్లేదట!

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) నటించిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో ఆదిత్య 369( Aditya 369 ) కూడా ఒకటి.

ఈ సినిమాకు సీక్వెల్ గా ఆదిత్య 999 మ్యాక్స్( Aditya 999 Max ) తెరకెక్కనుందని గతంలో వార్తలు వచ్చాయి.

అయితే అన్ స్టాపబుల్ సీజన్ 4 లో భాగంగా బాలయ్య మాట్లాడుతూ పుష్ప ది రూల్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదిత్య 369కు సీక్వెల్ గా ఆదిత్య 999 మ్యాక్స్ రానుందని ఆయన అన్నారు.

మా అబ్బాయి మోక్షజ్ఞ( Mokshagna ) ఈ సినిమాలో హీరోగా యాక్ట్ చేస్తాడని బాలయ్య తెలిపారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని బాలయ్య చెప్పుకొచ్చారు.

త్వరలో ఈ సినిమా పట్టాలెక్కనుందని ఆయన పేర్కొన్నారు.బాలయ్య ఈ విషయాలు చెప్పిన ఎపిసోడ్ ఈ నెల 6వ తేదీన ప్రసారం కానుంది.

Advertisement

ఈ ఎపిసోడ్ లో బాలయ్య ఆదిత్య 369 మూవీకి సంబంధించిన గెటప్ లో కనిపించనున్నారని భోగట్టా.అయితే ఆదిత్య 999 మ్యాక్స్ కు డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు జవాబు దొరకాల్సి ఉంది.

మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ప్రశాంత్ వర్మ( Prashanth varma ) డైరెక్షన్ లో తెరకెక్కనుంది.ఈ సినిమాకు సంబంధించిన షూట్ ఇప్పటికే మొదలైందని తెలుస్తోంది.బాలయ్య త్వరలో డాకు మహారాజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

డాకు మహారాజ్ మూవీ కథ, కథనం కొత్తగా ఉంటాయని తెలుస్తోంది.డాకు మహారాజ్( Daku Maharaj ) సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ఎప్పుడు విడుదలవుతుందో చూడాల్సి ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మోక్షజ్ఞ తొలి సినిమాకే భారీ రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారని సమాచారం అందుతోంది.మోక్షజ్ఞ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ఎప్పుడు థియేటర్లలో రిలీజవుతుందో చూడాల్సి ఉంది.

దేవర ముంగిట నువ్వెంత.. థియేటర్లలో పుష్ప2 రిలీజవుతున్నా అక్కడ దేవర హవా!
మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య రాజీ కుదిరిందా..?

మోక్షజ్ఞ మీడియా ముందుకు ఎప్పుడు వస్తారో చూడాల్సి ఉంది.మోక్షజ్ఞ ట్విట్టర్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు