అందరికీ సమాధానం ఇచ్చేసిన బోయపాటి.. మామూలుగా లేదుగా!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై తొలుత ఎలాంటి అంచనాలు క్రియేట్ కాలేదు.

అసలే బోయపాటి తీసిని గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద హ్యాండ్ ఇచ్చాయి.దీంతో ఈ సినిమా కూడా అదే తరహాలో ఉంటుందని అందరూ భావించారు.

ఇక కొందరైతే బోయపాటిని ఓ రేంజ్‌లో ట్రోల్ చేశారు.బాలయ్యకు మరో డిజాస్టర్‌ను అందించేందుకు బోయపాటి రెడీ అవుతున్నాడని హేళన చేశారు.

అయితే వారందరికీ బోయపాటి దిమ్మతిరిగేలా జవాబు ఇచ్చాడు.బాలయ్యతో ఆయన తెరకెక్కిస్తున్న చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఇటీవల బాలయ్య పుట్టినరోజున రిలీజ్ చేశారు.

Advertisement

ఈ టీజర్ పవర్‌ప్యాక్డ్‌గా ఉండటంతో నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు.ఇక ఈ టీజర్‌తో తనను ట్రోల్ చేసిన వారందరికీ బోయపాటి అదిరిపోయే జవాబు ఇచ్చాడు.

బోయపాటి-బాలయ్య కాంబో ఇప్పటికే సింహా, లెజెండ్ సినిమాలు వచ్చి బాక్సాఫీస్ హిట్‌లుగా నిలిచాయి.ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తుండగా అందులో ఒకటి అఘోరా పాత్ర అని తెలుస్తోంది.

కాగా రెండో పాత్రకు సంబంధించిన టీజర్‌నే చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.మరి అఘోరా పాత్రలో బాలయ్య ఎలా ఉంటాడో తెలియాలంటే మాత్రం ఆ లుక్‌కు సంబంధించిన పోస్టర్, టీజర్ వచ్చే వరకు ఆగాల్సిందే.

ఇక ఈ సినిమాలో ఓ కొత్త హీరోయిన్ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది.

విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ...క్లారిటీ ఇచ్చిన టీమ్!

Advertisement

తాజా వార్తలు