నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి( Anil Ravipudi ) దర్శకత్వంలో రూపొందిన భగవంత్ కేసరి సినిమా( Bhagavanth kesari movie ) వంద కోట్ల నుంచి రూ.150 కోట్ల వసూళ్ల దిశగా దూసుకు పోతుంది.భారీ విజయాన్ని సొంతం చేసుకున్న భగవంత్ కేసరి ఈ స్థాయి లో కలెక్షన్స్ ను రాబట్టడం కు కారణం కచ్చితంగా భారీ ఎత్తున ప్రమోషన్ చేయడం అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఎంతో మంది దర్శకులు, నిర్మాతలు కూడా ఈ సినిమా కోసం మీడియా ముందుకు వచ్చి ప్రమోషన్ ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు.

అంతే కాకుండా చిన్న చిన్న యూట్యూబ్ సెలబ్రిటీలతో మరియు ఇన్ స్టా సెలబ్రిటీలతో కూడా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చేయడం జరిగింది.అందుకే ఈ సినిమా కు మంచి ఓపెనింగ్స్ దక్కాయి.సినిమా విడుదల అయిన తర్వాత కూడా సోషల్ మీడియా ద్వారా చాలా మంది పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది అటూ మాట్లాడుకోవడంతో సినిమాకు మంచి వసూళ్లు నమోదు అయ్యాయి.రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు కంటే ఈ సినిమా గొప్పగా ఏమీ లేదు.
అయినా కూడా ఈ సినిమాకు భారీ వసూళ్లు రావడం ఆశ్చర్యంగా ఉంది అంటూ బాక్సాఫీస్ వసూళ్లను దగ్గర నుంచి పరిశీలించే ఒక వ్యక్తి అంటున్నారు.

భగవంత్ కేసరి కి ఎక్కువ ప్రచారం చేయడం కలిసి వచ్చింది.కనుక ముందు ముందు కూడా తమ సినిమాల ఫలితాలను తేల్చే విధంగా యూనిట్ సభ్యులు ప్రమోషన్ కార్యక్రమాలు చేసుకోవాలి అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.బాలకృష్ణ తో పాటు శ్రీ లీల( Sreeleela ) ఇంకా దర్శకుడు అనిల్ రావికూడి కాళ్లకు చక్రాలు కట్టుకుని మరీ ప్రచారం చేశారు.
అందుకు తగ్గ ఫలితం దక్కింది అనడంలో సందేహం లేదు.రేపు వైజాగ్ లో భారీ ఎత్తున చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొని సందడి చేయబోతున్న విషయం తెల్సిందే.