బిబి3 : ఆలూ లేదు సూలు లేదు అన్నట్లుగా ఉంది పరిస్థితి

కరోనా కారణంగా నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి మూవీకి సంబంధించిన షూటింగ్‌ నిలిచి పోయింది.వచ్చే ఏడాది ఆరంభంలో షూటింగ్‌ మొదులు పెట్టాలని భావిస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో షూటింగ్‌కు హాజరు కాకపోవడం మంచిది అనే ఉద్దేశ్యంతో వారు ఉన్నారు.సినిమా గురించి ఎలాంటి చర్చలు కాని స్క్రిప్ట్‌ మార్పు చేర్పులు కాని ఏం జరగడం లేదు.

కాని చిత్ర యూనిట్‌ సభ్యులు అది ఇది అంటూ ఎన్నో రకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి.ఆలూ లేదు సూలు లేదు అన్న చందాన బాలయ్య బోయపాటి కాంబో 3 మూవీ గురించి రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి.

పెద్ద ఎత్తున అంచనాలు ఉన్న ఈ సినిమాకు మోనార్క్‌ అనే టైటిల్‌ పెట్టారు అంటూ కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి.ఇప్పుడు మరో టైటిల్‌ను పరిశీలిస్తున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది.

Advertisement

డేంజర్‌ అనే టైటిల్‌ను బాలయ్యకు సెట్‌ చేసేందుకు దర్శకుడు బోయపాటి ప్లాన్స్‌ చేస్తున్నారు అనేది సోషల్‌ మీడిఆలో జరుగుతున్న ప్రచారం.ఇది కూడా నిజం కాదని యూనిట్‌ సభ్యులు అనధికారికంగా చెబుతున్నారు.

డేంజర్‌ టైటిల్‌తో కృష్ణవంశీ గతంలో ఒక సినిమాను తెరకెక్కించాడు.ఆ సినిమా నిరాశ పర్చింది.

అయితే ఆ సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది కనుక టైటిల్‌ను ఈ సినిమాకు వాడుకుంటే పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు అనుకుంటున్నారు.ఎలాంటి అనుమానం అభ్యంతరం లేకుండా డేంజర్‌ టైటిల్‌ను బోయపాటి ప్లాన్‌ చేస్తున్నాడు అంటున్నారు.

మొత్తానికి సినిమాకు సంబంధించి ఎలాంటి హడావుడి లేకున్నా కూడా టైటిల్‌ ఇదిగో విడుదల అదుగో విడుదల అంటూ నెటిజన్స్‌ హడావుడి అయితే చేస్తున్నారు.

సూర్య తో మల్టీ స్టారర్ సినిమా చేయనున్న మరో స్టార్ హీరో...
Advertisement

తాజా వార్తలు