బాలయ్య అఖండ సినిమాకు మరీ ఇంత అన్యాయం చేస్తున్నారేంట్రా బాబు?

నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా విషయం లో మొన్న జరిగిన సైమా అవార్డ్స్ మరియు నిన్న జరిగిన ఫిలిం ఫేర్ అవార్డ్స్ వేడుకల్లో అవమానం జరిగిందంటూ నందమూరి అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అఖండ సినిమా దాదాపుగా 200 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేసింది.

 Balakrishna Akhanda Movie Din't Get Film Fare Awards , Balakrishna, Akhanda Movi-TeluguStop.com

ఎంతో మంది ప్రముఖులు మరియు మీడియా వారు ప్రశంసలు కురిపించారు.అయినా కూడా సినిమాకు అవార్డ్స్ దక్కక పోవడం ఆశ్చర్యంగా ఉందంటూ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఉత్తమ హీరో మరియు ఉత్తమ దర్శకుడు ఇంకా ఉత్తమ సినిమా ఇలా నాలుగు ఐదు కేటగిరీ లో అఖండ సినిమా అవార్డు సొంతం చేసుకోవడానికి అర్హత ఉన్నది, కానీ అవార్డుల ఎంపిక కోసం ఏర్పాటైన జ్యూరీ రాజకీయం చేసి ఇలా అఖండ సినిమాను పక్క కు పెట్టి అన్యాయం చేశారంటూ బాలకృష్ణ అభిమానులు మరియు కొందరు మీడియా వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

బాలకృష్ణ అఖండ సినిమా అవార్డు విన్నింగ్ అర్హత ఉన్నది అనడంలో ఎలాంటి సందేహం లేదు, కానీ ఆ సినిమాకు మించి అర్హత ఉన్న సినిమా లు మరియు నటీనటులు ఉన్న కారణంగానే ఆ సినిమా ను పక్కన పెట్టి ఉంటారు అనేది కొంత మంది అభిప్రాయం.ఈ విషయం లో అనవసర రాద్ధాంతం చేసి మంచి ఆదరణ ఉన్న ఫిలిం ఫేర్ అవార్డులను అల్లరి పాలు చేయవద్దంటూ కొందరు విజ్ఞప్తి చేస్తున్నారు.ఈ విషయం లో అల్లు అర్జున్ అభిమానులు మరియు నందమూరి అభిమానులు సోషల్ మీడియా ద్వారా చిన్న పాటి యుద్ధ వాతావరణం నెలకొల్పే విధంగా ట్వీట్స్‌ చేస్తున్నారు.

ఇది ఎంత వరకు కరెక్ట్ అంటూ వారికి వారి ప్రశ్నించుకుంటే బాగుంటుందని కొందరు ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube