బాలయ్యకు ఇంతకంటే మంచి రోజు ముందు ఏమైనా ఉందా?

నందమూరి బాలకృష్ణ తన 107వ సినిమా టైటిల్‌ ను జై బాలయ్య అంటూ కన్ఫర్మ్‌ చేశాడని. సీనియర్ ఎన్టీఆర్‌ 100వ జయంతి సందర్బంగా ఫస్ట్‌ లుక్‌ ను టైటిల్ తో సహా విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.

 Balakrishna 107 Movie Title Not Fixed Yet , Balakrishna , Balakrishna 107 Movie , Jai Balayya , 100th Anniversary Of Senior Ntr,gopichand,107th Movie First Look-TeluguStop.com

కాని నేడు టైటిల్‌ విషయంలో ఉన్న అనుమానాలు అన్నింటిని పటాపంచలు చేసి మొత్తం తలకిందులు చేశాడు.ఏం చేయాలో పాలుపోని విధంగా నందమూరి అభిమానులను ఉంచాడు.

బాలయ్య మరియు గోపీచంద్‌ ల కాంబోలో రూపొందుతున్న 107వ సినిమాకు సంబంధించిన షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం జులై నెలలో సినిమా ను ముగిస్తారట.

 Balakrishna 107 Movie Title Not Fixed Yet , Balakrishna , Balakrishna 107 Movie , Jai Balayya , 100th Anniversary Of Senior NTR,Gopichand,107th Movie First Look-బాలయ్యకు ఇంతకంటే మంచి రోజు ముందు ఏమైనా ఉందా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదే ఏడాది లో బాలయ్య సినిమా ను విడుదల చేసే ఉద్దేశ్యం తో ఉన్నారు.భారీ అంచనాలున్న బాలయ్య 107వ సినిమా టైటిల్‌ ను రివీల్‌ చేయనున్నట్లుగా వచ్చిన వార్తలు అన్ని కూడా పుకార్లే అని తేలిపోయింది.

ఈ సమయంలో బాలయ్య అభిమానులు కూడా తీవ్రంగా నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

బాలయ్య కు నేడు ఎన్టీఆర్‌ 100వ జయంతి కంటే మంచి రోజు లభిస్తుందా.

ఆయన ఎందుకు నేడు తన 107వ సినిమా ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేయలేదు అంటూ విమర్శలు చేస్తున్నారు.ఇదే రోజున బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ను కూడా హీరోగా పరిచయం చేస్తే బాగుంటుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.

కాని అది కూడా సాధ్యం కాలేదు.అసలు బాలయ్య కు ఇంత కంటే మంచి రోజు ముందు ఏది ఉందంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఎన్టీఆర్‌ 100వ జయంతి వేడుకలను భారీ గా నిర్వహిస్తున్న బాలయ్య తన సినిమా లకు సంబంధించిన అప్‌ డేట్స్ ఇవ్వకుంటే అభిమానుల నుండి వ్యతిరేకత రాదా అంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube