జబర్దస్త్ ( Jabardasth ) కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి కమెడియన్ వేణు( Venu ) ప్రస్తుతం డైరెక్టర్ గా ఇండస్ట్రీలో రాణిస్తున్న సంగతి తెలిసిందే.ఈయన ప్రస్తుతం దర్శకుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు వేణు డైరెక్షన్ లో ప్రియదర్శి నటించిన బలగం( Balagam ) సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే.
ఈ సినిమా తెలంగాణలో గ్రామీణ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇక ఈ సినిమా ఎన్నో అవార్డులను పురస్కారాలను కూడా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో వేణు రెండో సినిమాని నాని( Nani ) ని డైరెక్షన్ చేసే ఛాన్స్ దక్కించుకున్నారు.త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా రాబోతుంది.
ఇలా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి వేణు మరొక కమెడియన్ ధనరాజ్ తో కలిసి ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు.తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.
ఈ ప్రోమోలో భాగంగా అలీ ( Ali )ధనరాజ్( Dhanraj ) వేణు మధ్య సంభాషణలు జరిగాయి ఈ క్రమంలోనే ఆలీ వేణుని ప్రశ్నిస్తూ.కమర్షియల్ సినిమాలు రాణిస్తున్నటువంటి సమయంలో బలగం సినిమాని చేయడం వెనుక కారణమేంటని ప్రశ్నించారు.వేణు ఎలాంటి సమాధానం ఇచ్చాడో ఎపిసోడ్ చూడాల్సిందే.అయితే తనకి ఎదురైన అవమానం మాత్రం వేణు వెల్లడించారు.ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో టెక్నీషియన్ లతో తాను చర్చిస్తున్నటువంటి సమయంలో ఒక అతను ఏదో పెద్ద బాహుబలి( Bahubali ) సినిమా తీస్తున్నట్టు ఫీలవుతున్నావని అవమానించారు.కానీ ఈ సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమా చిన్న సినిమాలలో బాహుబలి అంటూ మీరు ప్రశంసించడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అంటూ వేణు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.