బాహుబలి తీసినట్టు ఫీల్ అవుతున్నావ్.. బలగం డైరెక్టర్ ఇన్ని అవమానాలు ఎదుర్కొన్నారా?

జబర్దస్త్ ( Jabardasth ) కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి కమెడియన్ వేణు( Venu ) ప్రస్తుతం డైరెక్టర్ గా ఇండస్ట్రీలో రాణిస్తున్న సంగతి తెలిసిందే.

ఈయన ప్రస్తుతం దర్శకుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు వేణు డైరెక్షన్ లో ప్రియదర్శి నటించిన బలగం( Balagam ) సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే.

ఈ సినిమా తెలంగాణలో గ్రామీణ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంది.

"""/" / ఇక ఈ సినిమా ఎన్నో అవార్డులను పురస్కారాలను కూడా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో వేణు రెండో సినిమాని నాని( Nani ) ని డైరెక్షన్ చేసే ఛాన్స్ దక్కించుకున్నారు.

త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా రాబోతుంది.ఇలా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి వేణు మరొక కమెడియన్ ధనరాజ్ తో కలిసి ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు.

తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. """/" / ఈ ప్రోమోలో భాగంగా అలీ ( Ali )ధనరాజ్( Dhanraj ) వేణు మధ్య సంభాషణలు జరిగాయి ఈ క్రమంలోనే ఆలీ వేణుని ప్రశ్నిస్తూ.

కమర్షియల్ సినిమాలు రాణిస్తున్నటువంటి సమయంలో బలగం సినిమాని చేయడం వెనుక కారణమేంటని ప్రశ్నించారు.

వేణు ఎలాంటి సమాధానం ఇచ్చాడో ఎపిసోడ్ చూడాల్సిందే.అయితే తనకి ఎదురైన అవమానం మాత్రం వేణు వెల్లడించారు.

ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో టెక్నీషియన్ లతో తాను చర్చిస్తున్నటువంటి సమయంలో ఒక అతను ఏదో పెద్ద బాహుబలి( Bahubali ) సినిమా తీస్తున్నట్టు ఫీలవుతున్నావని అవమానించారు.

కానీ ఈ సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమా చిన్న సినిమాలలో బాహుబలి అంటూ మీరు ప్రశంసించడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అంటూ వేణు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

వైరల్ వీడియో: పేదలపట్ల ఇలాంటి నీచమైన పని అవసరమా?