నటుడు సత్యరాజ్ ( Sathya raj ) అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ కట్టప్ప( Kattappa ) అంటే మాత్రం అందరికీ ఈయన గుర్తుకు వస్తారు.సత్యరాజ్ ఎన్నో సినిమాలలో హీరోగా నటించిన కాకుండా తెలుగు తమిళ కన్నడ భాష చిత్రాలలో సపోర్టింగ్ పాత్రలలో కూడా నటిస్తూ పెద్దయితున్న ప్రేక్షకులను సందడి చేశారు.
అయితే ఈయనకు బాహుబలి సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు లభించింది.బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రలో నటించినటువంటి సత్యరాజ్ ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇలా బాహుబలి సినిమా</em( Bahubali ) తర్వాత ఈయన క్రేజ్ అమాంతం పెరిగిపోయిందని చెప్పాలి.

ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నటువంటి ఈయన నేడు పుట్టినరోజు ( Birthday ) జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో సెలబ్రిటీలు అలాగే అభిమానులు ఈయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇక ఈయన పుట్టినరోజు సందర్భంగా ప్రస్తుతం ఈయన ఒక్కో సినిమాకు తీసుకుంటున్నటువంటి రెమ్యూనరేషన్ ఎంత అలాగే ఈయన తదుపరి సినిమాలు ఏంటి ఎంత మొత్తంలో ఆస్తులు సంపాదించారునే విషయాల గురించి ప్రస్తుతం ఒక వార్త వైరల్ గా మారింది.మరి ఇన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి సత్యరాజ్ ఏ మేరకు ఆస్తులు కూడా పెట్టారు అనే విషయానికి వస్తే…

సత్యరాజ్ ( Sathya raj ) ఒక్కో సినిమాకు సుమారు రెండు కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్( Remuneration ) అందుకుంటున్నారని తెలుస్తుంది.ఇలా సినిమాకు రెండు కోట్ల రూపాయలు మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నటువంటి ఈయనకు చెన్నైలో ఖరీదైన ఇల్లు ఉంది.ఈ ఇంటి విలువ దాదాపు 6 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయల వరకు విలువ చేస్తుందని తెలుస్తుంది.
వీటితో పాటు మరికొన్ని చోట్ల విలువైనటువంటి ఆస్తులు ఉన్నాయని సమాచారం అలాగే ఈయన గ్యారేజ్ లో కోట్లు విలువచేసే మూడు ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి.ఇలా సత్యరాజ్ మొత్తం ఆస్తులు విలువ సుమారు 70 నుంచి 80 కోట్ల మధ్యలో ఉంటుందని సమాచారం.







