తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ డిస్మిస్ అయింది.ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదంటూ వేసిన పిటిషన్ ను గతంలో హైకోర్టు కొట్టివేసింది.
దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.ఈ మేరకు పిటిషన్ ను విచారించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం కొట్టివేసింది.
అనంతరం ఇదే కేసులో సండ్ర వెంకట వీరయ్య వేసిన పిటిషన్ విచారణను అత్యున్నత న్యాయస్థానం డిసెంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.







