టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కృతిశెట్టికి ప్రేక్షకులలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు విజయాలు కృతిశెట్టికి ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయాన్ని కలిగించాయి.
ఇతర భాషల్లో కూడా ఆఫర్లను అందుకుంటున్న కృతిశెట్టి ది వారియర్, మాచర్ల నియోజకవర్గం సినిమాలతో కూడా విజయాలను సొంతం చేసుకుంటారని అభిమానులు భావించారు.అయితే ఈ రెండు సినిమాలు కృతిశెట్టికి భారీ షాకిచ్చాయనే చెప్పాలి.
గత నెలలో విడుదలైన ది వారియర్ యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ రిజల్ట్ ను అందుకుంది.అయితే ది వారియర్ సినిమా ఫ్లాప్ అయినా కృతిశెట్టి పోషించిన విజిల్ మహాలక్ష్మి పాత్రకు మంచి మార్కులు పడ్డాయి.
అయితే ది వారియర్ ఫ్లాప్ ను మరిచిపోకముందే మాచర్ల నియోజకవర్గం సినిమాతో కృతిశెట్టి ఖాతాలో మరో ఫ్లాప్ చేరడం గమనార్హం.ఈ సినిమా పుంజుకోవడం కూడా కష్టమేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.

కృతిశెట్టికి బ్యాడ్ డేస్ మొదలయ్యాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఈ సినిమాతో ఆమె ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందని నెటిజన్లు చెబుతున్నారు.కథల విషయంలో కృతిశెట్టి జాగ్రత్త పడాల్సిన సమయం ఆసన్నమైందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సరైన కథలను ఎంచుకోకపోతే కృతిశెట్టికి సినిమా ఆఫర్లు తగ్గడానికి ఎంతో సమయం పట్టదని చెప్పవచ్చు.
సినిమాసినిమాకు కృతిశెట్టి రేంజ్ పెరుగుతోంది.

కృతిశెట్టికి తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలు దక్కకపోతే మాత్రం ఆమె కెరీర్ ప్రమాదంలో పడే ఛాన్స్ అయితే ఉంటుంది.కెరీర్ విషయంలో కృతిశెట్టి ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది.రొటీన్ కథలకు కృతిశెట్టి ఓకే చెబితే మాత్రం ఆమె ఇండస్ట్రీకి దూరం కావడానికి ఎంతో సమయం పట్టదు.
కృతిశెట్టికి స్టార్ హీరోల సినిమాలలో ఆఫర్లు వచ్చే తరుణంలో వరుస ఫ్లాపులు ఎదురుకావడం గమనార్హం.