తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సీరియల్ నటి,జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట యాంకర్ గా కెరీర్ను ప్రారంభించి, ఆ తర్వాత మోడలింగ్ లోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ.
అనంతరం ప్రదీప్ యాంకర్ గా వ్యవహరించిన పెళ్లి చూపులు ప్రోగ్రాం తో ఎంట్రీ ఇచ్చింది.అనంతరం గోరింటాకు సీరియల్ ద్వారా తన నటనను మొదలుపెట్టింది రీతు చౌదరి.
ఆ తర్వాత ఈమెకు వరుసగా అవకాశాలు వచ్చి చేరాయి.అలా బుల్లితెరపై ప్రసారమవుతున్న సూర్యవంశం, ఇంటిగుట్టు, అమ్మకోసం లాంటి సీరియల్స్ లో కీలకపాత్రలు పోషించి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది.
ఈ క్రమంలో అడపాదడపా సినిమాలలో సైతం మెరిసింది.
ఆ తర్వాత జబర్దస్త్ కి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారీటీని సంపాదించుకుంది.
అంతేకాకుండా సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని పెట్టి రకరకాల వీడియోలను షేర్ చేస్తూ ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది.కాగా జబర్దస్త్, సీరియల్స్ ద్వారా కంటే రీతు చౌదరి సోషల్ మీడియాలోనే బాగా ఫేమస్ అయ్యింది అని చెప్పవచ్చు.
రీతు చౌదరికి సోషల్ మీడియాలో బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.తన గ్లామర్ తో సెగలు పుట్టిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్లతో కుర్రకారును రెచ్చగొడుతూ ఉంటుంది.ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో ముచ్చటిస్తూ, తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది రీతు చౌదరి.

ఇది ఇలా ఉంటే తాజాగా తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది రీతూ చౌదరి.తన బాయ్ ఫ్రెండ్ పేరు శ్రీకాంత్ అని, త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నట్లు తెలిపింది.ఈ క్రమంలోనే అతనితో కలిసి దిగిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.శ్రీకాంత్ తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.తమ బంధం కంటే ఏది బెటర్ కాదు అంటూ క్యాప్షన్ కూడా జోడించింది.అయితే రీతూ చౌదరి ఆ పోస్ట్ పెట్టిన తర్వాత ఆమె గురించి అభిమానులు తెలుసుకోవడానికి కుతూహలంగా ఉన్నారు.
ఆమె బాయ్ ఫ్రెండ్ శ్రీకాంత్ ఎవరు అతని బ్యాగ్రౌండ్ ఏమిటి? అతని ఏం పని చేస్తాడు ఇలా ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకోవాలని అభిమానులు ఆరాటపడుతున్నారు.కాగా తాజాగా అందిన సమాచారం ప్రకారం.
రీతు బాయ్ ఫ్రెండ్ శ్రీకాంత్ రాజకీయ నేపథ్యం, బాగా ఆస్తిపాస్తులు కలిగిన ఫ్యామిలీకి చెందిన వాడు అని తెలుస్తోంది.అయితే వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని సినీవర్గాలు చెబుతున్నాయి.
మరి ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉండగా ప్రస్తుతం వీరి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.







