నిజంగా ఈ బుడ్డోడు 'బాల బాహుబలి'.. ఏకంగా 6.8 కిలోల బరువుతో పుట్టాడు

సాధారణంగా ఎక్కడైనా పిల్లలు ఆరోగ్యకరమైన బరువుతో పుట్టాలని తల్లిదండ్రులు కోరుకుంటారు.వారు తక్కువ బరువుతో పుడితే తల్లడిల్లిపోతారు.

 Baby Weighing More Than 14 Pounds At Birth Sets Record At Ontario Hospital Detai-TeluguStop.com

ఇక ఆ పిల్లలను వైద్యులు ఇంక్యుబేటర్ బాక్సులో పెడతారు.ఐసీయూలో తమ పిల్లలను చూసి తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు.

వారు ఆరోగ్యంగా తిరిగి రావాలని మొక్కుకుంటుంటారు.అయితే కొన్ని అరుదైన సందర్భాలలో పిల్లలు సాధారణం కంటే ఎక్కువ బరువుతో పుడతారు.

అలాంటి వారిని చూసి డాక్టర్లే ఆశ్చర్యపోతుంటారు.ఇలాంటి ఓ సంఘటన కెనడాలోని( Canada ) అంటారియోలో ఇటీవల జరిగింది.ఓ బాలుడు ఏకంగా 14 పౌండ్ల 8 ఔన్సులు (6.8 కిలోలు) బరువుతో పుట్టాడు.

Telugu Pounds Baby, Baby, Britteney, Canada, Chance, Ontario-Latest News - Telug

ఇది విన్న తల్లిదండ్రులు, వైద్యులు ఆశ్చర్యంలో మునిగిపోయారు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అంటారియోలో ఉండే దంపతులు బ్రిటనీ,( Britteney ) ఛాన్స్ అయ్యర్స్( Chance Ayres ) దంపతులకు ఇటీవల మగబిడ్డ( Baby Boy ) పుట్టాడు.అయితే బరువు మాత్రం అసాధారణంగా ఉంది.ఆ బాలుడు ఏకంగా 6.8 కిలోల బరువు ఉన్నాడు.సాధారణంగా పుట్టే పిల్లల బరువు సగటున 3.5 కిలోల బరువు ఉంటారు.ఇక సాధారణంగా పిల్లలు 2.5 కిలోల నుంచి 4.5 కిలోల వరకు పుడుతుంటారు.అయితే కెనడా దంపతులకు పుట్టిన పిల్లాడి బరువు 6.8 కిలోలు ఉండడంతో అందరూ ఆశ్చర్యపోతుంటారు.

Telugu Pounds Baby, Baby, Britteney, Canada, Chance, Ontario-Latest News - Telug

ఒంటారియోలోని( Ontario ) కేంబ్రిడ్జ్ మెమోరియల్ హాస్పిటల్‌లో అక్టోబర్ 23న సిజేరియన్ ద్వారా ఓ బాబుకు జన్మనిచ్చారు.బ్రిటనీ, ఛాన్స్ అయర్స్‌ దంపతులకు ఈ బాబు ఐదో సంతానం.అతని ఇద్దరు తోబుట్టువులు 13 పౌండ్ల బరువుతో జన్మించినప్పటికీ, ఆ బాలుడు అంచనాలకు మించిన బరువుతో జన్మించాడని తెలుస్తోంది.2010 నుంచి ఇదే రికార్డ్ అని వైద్యులు చెబుతున్నారు.ఇటీవల కాలంలో 5 కిలోల బరువుతో పిల్లలు జన్మించిన దాఖలాలు ఉన్నాయి.

అయితే కెనడాలో పుట్టిన సోనీ అనే బాలుడు మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube