Vijay Devarakonda : బేబీ సక్సెస్ మీట్ లో సందడి చేసిన విజయ్.. మూవీ సక్సెస్ కు కారణం అదేనంటూ ?

హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి నటించిన తాజా చిత్రం బేబీ( Baby movie )ఇటీవల విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని అందుకోవడంతో పాటు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ను హైదరాబాదులో గ్రాండ్ గా నిర్వహించారు.

 Baby Movie Success Celebrations Vijay Devarakonda Speech-TeluguStop.com

ఈ వేడుకకు విజయ్ దేవరకొండ, అల్లు అరవింద్, నాగబాబు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఇకపోతే ఈ సందర్భంగా హీరోయిన్ వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.

Telugu Baby, Tollywood-Movie

నాకు హీరో విజయ్ దేవరకొండ ( Vijay devarakonda )యాక్టింగ్ అంటే చాలా ఇష్టం.అతనికి నేను వీరాభిమానిని.నా చిన్నప్పటి నుంచి నాకు యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఉండడంతో మా తల్లిదండ్రులు కూడా నన్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చారు.వాళ్ల సపోర్ట్ వల్లే నేను ఈరోజు ఇలా వేదిక మీద ఉన్నాను.

ఫీచర్లో ఇంకా మీకు మంచి పేరు తీసుకువస్తాను.తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావని అంటుంటారు.

కానీ ప్రయత్నిస్తే నాకు బేబీ సినిమా అవకాశం వచ్చినట్లే మీకు వస్తుంది.ఈ సినిమా సక్సెస్ చూస్తుంటే ఇన్నేళ్ల నుంచి దీని కోసమే కదా కష్టపడింది అనిపిస్తోంది.

మా సినిమాకు రియల్ హీరోస్ మా టెక్నీషియన్స్ అని చెప్పుకొచ్చింది వైష్ణవి చైతన్య.

Telugu Baby, Tollywood-Movie

అనంతరం హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.థియేటర్‌లో కూర్చున్న వెంటనే ఓ రెండు ప్రేమ మేఘాలిలా పాట వచ్చింది.అప్పుడే ఒక మంచి లవ్ స్టోరీ చూపిస్తున్నారనే ఫీల్‌లోకి వెళ్లిపోయాను.

కానీ ఇప్పుడు ఈ సినిమా గురించి డిబేట్ చేస్తున్నారు.క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటున్నారు.

ఇందులో ఒకరు చెడ్డ, మరొకరు మంచి చెప్పడం ఉద్దేశం కాదు.సొసైటీలో అన్ని రకాల వ్యక్తిత్వాలు ఉన్న వాళ్లు ఉంటారు.

నాకు చాలా మంది మంచి అమ్మాయిలు స్నేహితులుగా ఉండేవారు.వారి గుడ్ ఫ్రెండ్‌షిప్ తెలుసు.

వైష్ణవి( Vaishnavi Chaitanya ) క్యారెక్టర్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే.అబ్బాయిలు కూడా లవ్ బ్రేక్ చేసేవాళ్లు ఉంటారు.

దర్శకుడు సాయి రాజేశ్ హానెస్ట్‌గా అటెంప్ట్ చేశాడు.అతను నాకు ఎప్పుడైనా ఫోన్ చేయవచ్చు.

నేను సపోర్ట్ చేసేందుకు రెడీగా ఉంటాను.అల్లు అరవింద్ గారి వల్ల వాసు గారు, మారుతి, ఎస్కేఎన్ గారు ఇలా వారి దగ్గర నుంచి ఈ టీమ్ ఒకరి సపోర్ట్‌తో మరొకరు ఇలా వస్తున్నాము.

మా అందరిలో మంచి కథలు తెరపై చూపించాలనే ప్రయత్నమే ఉంటుంది.ఆనంద్ తనకు తానుగా ప్రాజెక్ట్స్ చేసుకుంటున్నాడు.

ఇవాళ తన సక్సెస్ గర్వంగా ఉంది అని చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube