ఈ ఏడాది విడుదలైన సినిమాలలో భారీ కలెక్షన్లను సాధించిన సినిమాల జాబితాలో బేబీ మూవీ ( Baby movie )ముందువరసలో ఉంటుంది.ఈ సినిమా ఇప్పటికీ కొన్ని థియేటర్లలో చెప్పుకోదగ్గ స్థాయిలో షేర్ కలెక్షన్లను సాధిస్తోంది.
పైదరాబాద్ లోని పలు థియేటర్లలో ఈరోజు కూడా బేబీ మూవీ బుకింగ్స్ బాగున్నాయి.బేబీ సినిమా సక్సెస్ తో ఈ సినిమాలో నటించిన ప్రధాన నటీనటులకు ఆఫర్లు పెరుగుతుండటం గమనార్హం.
బ్రో సినిమా( Bro movie ) విడుదలైనా ప్రధాన థియేటర్లలో బేబీ మూవీ డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది.బేబీ మూవీ ఫుల్ రన్ కలెక్షన్లు భారీగానే ఉండబోతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
బేబీ మూవీ ఫుల్ రన్ లో 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకునే ఛాన్స్ అయితే ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.మరోవైపు బేబీ మూవీలో మరొకొన్ని కొత్త సీన్లను యాడ్ చేయనున్నారని తెలుస్తోంది.

14 నిమిషాల నిడివి ఉన్న ఫుటేజీని యాడ్ చేయనున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఈ ఫుటేజీలో ఒక సాంగ్ కూడా యాడ్ కానుందని తెలుస్తోంది.బేబీ మూవీలో ఏడో సాంగ్ కూడా ఉండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.బేబీ సినిమా కలెక్షన్లు రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది.భోళా శంకర్ మూవీ( Bholaa Shankar ) విడుదలయ్యే వరకు బేబీ మూవీ హవాకు బ్రేకులు పడవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

బేబీ మూవీ ప్రస్తుతం పరిమిత సంఖ్యలో స్క్రీన్లలో ప్రదర్శితమవుతోంది.ఈ సినిమాకు సీక్వెల్ వస్తే బాగుంటుందని సీక్వెల్ తెరకెక్కినా సక్సెస్ సాధించడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.బేబీ సినిమా రీమేక్ హక్కులకు భారీ స్థాయిలో డిమాండ్ నెలకొందని తెలుస్తోంది.
అక్కడ కూడా ఈ సినిమా సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.బేబీ సినిమా నిర్మాతలకు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందించడం గమనార్హం.







