రెండో అంతస్తు నుంచి జారి పడ్డ చిన్నారి తరువాత ఏమైందంటే!

పిల్లలు ఎప్పుడు ఎలాంటి తుంటరి పనులు చేస్తుంటారో ఎవరికీ తెలీదు.వారిని పెంచడం ఈ తరం తల్లిదండ్రులకు పెద్ద సవాల్ గా మారుతుంది.

ఎప్పుడు ఎక్కడ తుంటరి చర్యలకు పాల్పడి ప్రమాదాలు తెచ్చుకుంటారో తెలీదు.వారిని నిత్యం ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుకోవలసి ఉంటుంది.

ఇలాంటి తుంటరి ఘటనే టర్కీ లోని ఇస్తాంబుల్ లో చోటుచేసుకుంది.ఇస్తాంబుల్ లో ఒక యువకుడు ఓ ఇంటి కింద నిలబడి ఉన్నాడు.

అయితే ఎందుకో అనుకోకుండా ఒకసారి పైకి చూడగా, రెండో అంతస్తు నుంచి రెండేళ్ల వయసు ఉన్న ఒక చిన్నారి కిటికీలో నుంచి తొంగి చూస్తూ ఒక్కసారిగా కింద పడింది.అయితే సరిగ్గా సమయంలో స్పందించిన ఆ యువకుడు వెంటనే అప్రమత్తమై ఆ చిన్నారిని క్యాచ్ పట్టుకున్నాడు.

Advertisement

దీనితో ఆ చిన్నారి ఎలాంటి ప్రమాదం లేకుండా సేఫ్ గా ఉంది.ఈ ఘటనతో అక్కడ సమీపంలో ఉన్న వారు అక్కడకు చేరుకొని విషయం పై ఆరా తీశారు.

దీనితో అసలు విషయం బయటపడింది.అయితే ఈ ఘటనకు సంబందించిన దృశ్యాలు అక్కడ సమీపంలోని సీసీ టీవీల్లో రికార్డ్ కావడం తో ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.

దీనితో చిన్నారి ప్రాణాలు కాపాడిన ఆ యువకుడిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.నిజంగా ఆ సమయంలో ఆ యువకుడు గనుక అక్కడ లేకున్నా,ఒకవేళ సరిగా స్పందించకపోయినా ఆ చిన్నారి మాత్రం ప్రాణాలతో ఉండేది కాదు.దీనితో ఆ చిన్నారి ప్రాణాలను కాపాడిన ఆ యువకుడిని తెగ మెచ్చుకుంటున్నారు.

అయితే చిన్నారి తల్లి కిచెన్ లో పని చేస్తుండగా, ఆ చిన్నారి కిటికీ నుంచి తొంగి చూస్తూ ప్రమాదవశాత్తు కింద పడినట్లు తెలుస్తుంది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారి హల్ చల్ చేస్తుంది.

వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..
Advertisement

తాజా వార్తలు