గెలుస్తారా లేదా అనే విషయాన్ని ప్రామాణికంగా తీసుకుని వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ వైసిపి అభ్యర్థుల జాబితాలను ప్రకటించారు.ఐదు విడతలుగా ప్రకటించిన జాబితాలో వచ్చిన పేర్లు చూస్తే జగన్ ఎక్కడా మొహమాటలకు వెళ్లలేదనే విషయం అర్థమవుతుంది.
మొదటి నుంచి తన వెంట నడిచిన వారు, పార్టీ కష్ట కాలంలో ఉన్న సమయంలో కేసులకు భయపడకుండా పార్టీ కోసం కష్టపడిన వారు, కీలక నేతలుగా గుర్తింపు పొందిన వారు , తనకు సన్నిహితులు, బంధువులు ఇలా చాలామంది విషయంలో జగన్( YS jagan ) మొహమాటలకు తావివ్వకుండా గెలుపు ఆధారంగానే టికెట్లు కేటాయించారు.మళ్లీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు అవకాశం లేని వారందరికీ న్యాయం చేస్తామని జగన్ హామీ ఇస్తున్నారు.
జగన్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయాలపై పార్టీ నేతల్లో అసంతృప్తి ఉన్నా, జగన్ అవేవీ పట్టించుకోవడం లేదు .
ఇది ఇలా ఉంటే జగన్ బాటలోనే టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) కూడా వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఈసారి అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలని, టిడిపి కచ్చితంగా ఈసారి ఎన్నికల్లో గెలిచి తీరాలని, అలా జరగాలంటే జగన్ మాదిరిగానే కచ్చితంగా గెలుస్తారు అనుకున్న వారికే టిక్కెట్లు ఇవ్వాలని , సర్వే నివేదికలను పరిగణలోకి తీసుకుని మొహమాటలను, సీనియర్ నేతల ఒత్తిడిని పట్టించుకోకుండా అభ్యర్థుల ఎంపిక పగడ్బందీగా నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారట .దాదాపుగా వైసీపీ అభ్యర్థుల జాబితా విడుదల కావడం, ఏ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తున్నారనే విషయంలో క్లారిటీ రావడంతో, వారికి దీటైన అభ్యర్థుల ఎంపిక చేసే విషయంలో ఎవరి ప్రమేయం లేకుండా అభ్యర్థుల ఎంపిక మొదలుపెట్టినట్టు తెలుస్తుంది.
పార్టీ అభ్యర్థులకు సంబంధించి ఏ కీలక నిర్ణయం తీసుకోవాలనేది ఎప్పుడూ పొలిట్ బ్యూరో లో చర్చించి నిర్ణయం తీసుకుంటారు .అయితే ఈసారి అభ్యర్థుల ఎంపిక విషయంలో పూర్తిగా తానే నిర్ణయం తీసుకోవాలని , జనసేన కు కేటాయించబోయే నియోజకవర్గాలు మినహా , మిగిలిన చోట్ల పూర్తి నిర్ణయం తానే తీసుకోవాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారట.