బాబు బ్యాచ్ సంచలనం.. బ్యాంకు రుణాల ఎగవేత కేసులో మరో టీడీపీ నేత..!

ఏపీలో విపక్ష పార్టీగా టీడీపీ కొనసాగుతుంది.అయితే ఆ పార్టీ నేత నారా లోకేశ్ నేతలను ఉద్దేశిస్తూ మీ మీద ఎన్ని కేసులు ఉంటే అంత పెద్ద పదవిని ఇస్తాను అంటూ గతంలో ఓ సారి బహిరంగ ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

 Babu Batch Sensation.. Another Tdp Leader In Bank Loan Evasion Case..!-TeluguStop.com

లోకేశ్ చేసిన సూచనతో టీడీపీ పార్టీ నేతలు దాన్ని నిజం చేసేందుకు ప్రయత్నిస్తున్నారా అంటే అవుననే అనిపిస్తుందంటున్నారు ఏపీ ప్రజలు.ప్రజలను దోచుకోవడమే కాదు.

బ్యాంకులకు టోకరా వేయడం.తప్పుడు లెక్కలు చూపించడమే చంద్రబాబుతో స్నేహానికి అర్హతలు అని మరోసారి రుజువైందని చెప్పుకోవచ్చట.

అదేంటి అనుకుంటున్నారా.? చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆయన అండ చూసుకుని బ్యాంకులను బురిడీ కొట్టించిన నేతల చరిత్ర ఒక్కొక్కటి బయటపడుతున్నాయని తెలుస్తోంది.ఇప్పటికే ఆ పార్టీకి చెందిన నేతలు సుజనా చౌదరి, సీఎం రమేశ్, జేసీ బ్రదర్స్ తదితరుల అక్రమ వ్యాపారాలు చేశారంటూ పలు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే వీరంతా మనీ లాండరింగ్ కేసుల్లో విచారణను ఎదుర్కొంటూ ఉండగా లిస్టులో తాజాగా మరో టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు కూడా చేరారని సమాచారం.

రాయపాటి సాంబశివరావు డొల్ల కంపెనీలతో పలు మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.దేశంలోనే అతి పెద్ద లోన్ స్కాంకు రాయపాటి పాల్పడ్డాడని ఈడీ గుర్తించిందని తెలుస్తోంది.ఈ కుంభకోణం వ్యవహారంపై విచారణ చేసిన ఈడీ అధికారులు కీలక విషయాలను వెలుగులోకి తీసుకువచ్చారు.

టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు దాదాపు 13 బ్యాంక్‌లలో సుమారు రూ.9,394 కోట్లు రుణాలు తీసుకుని ఆ డబ్బుని షెల్ కంపెనీలకి తరలించారని ఈడీ పేర్కొంది.ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ బ్యాంకు ఖాతాల నుంచి నిబంధనలకు విరుద్ధంగా సింగపూర్‌కు ఈ నగదు బదిలీ అయిందని ఈడీ గుర్తించింది.2019లోనే బ్యాంకు రుణాల ఎగవేత కేసులో రాయపాటి ఇల్లు, కార్యాలయాలపై సీబీఐ సోదాలు నిర్వహించింది.ఈ క్రమంలోనే మనీలాండరింగ్ కేసులో భాగంగా రాయపాటి ఇల్లు, ఆఫీసుల్లో ఈడీ ఏకకాలంలో 15 చోట్ల సోదాలు నిర్వహించి కీలకమైన పత్రాల్ని స్వాధీనం చేసుకుంది.

ఆ రుణం ఇప్పుడు వడ్డీతో కలిపి దాదాపు ముప్పయి వేల కోట్లకు చేరినట్లు బ్యాంకులు వెల్లడించాయి.

మనీలాండరింగ్ కేసుల భయంతో పార్టీ అధిష్టానం సూచనల మేరకు అప్పట్లో సుజనా చౌదరి, సీఎం రమేశ్ ఆగమేఘాలపై బీజేపీలో చేరిపోయారనే వార్తలు కూడా జోరుగా సాగిన విషయం తెలిసిందే.

అయితే వీళ్ల తరహాలో ఎంత మంది టీడీపీ నేతలు ఇలా మనీలాండరింగ్‌కి పాల్పడ్డారు? అనేది ఇప్పుడు ఏపీ ప్రజల మనసుల్లోని ప్రశ్నగా మారిందట.

అవినీతి, అక్రమాలు అంటే ఏంటో మాకు తెలియదంటూ చెప్పుకుని తిరిగే టీడీపీ నేతలు వీటన్నింటికీ ఏం సమాధానం చెబుతారో అంటూ పలువురు చురకలు అంటిస్తున్నారు.

వేల కోట్ల రూపాయలు పొగేసుకునే ఈ నేతలకు చంద్రబాబు సపోర్ట్ లేకుండా ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు.అలా సపోర్ట్ ఉంటేనే కదా నేతలు మళ్లీ ఎన్నికల కోసం ఖర్చు చేసి రుణం తీర్చుకునేది అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

అయితే పార్టీ రుణాన్ని తీర్చుకుంటారు కానీ బ్యాంకులకు మాత్రం కట్టాల్సిన రుణాన్ని కట్టలేరంటూ పలువురు ఎద్దేవా చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube