రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి గురించి మనమందరికి తెలిసిందే.ఇక ఈ సినిమాలో శివగామి వాగులో ఒక చేతితో బిడ్డను పట్టుకొని నదిని దాటుతూ వెళ్లే సీన్ మాత్రం హైలెట్ అని చెప్పవచ్చు.
ఇక ఆ సినిమాలో బాహుబలిని బతికించి వదిలే సీన్ అంత ఈజీగా మర్చిపోలేరు.అది తాజాగా అలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది.
కాగా ప్రస్తుతం ఎడతెరిపి వర్షాలు కురవడం వల్ల గోదావరికి వరద పోటెత్తడంతో మంథని మునిగిపోయింది.దీంతో లోతట్టు ప్రాంతాలు అన్నీ కూడా జలమయమయ్యాయి.
ఇప్పటికే దాదాపుగా ఇళ్లలోకి నీరు చేయడమే కాకుండా ఇల్లు అన్ని కూడా పూర్తిగా మునిగిపోయాయి.మర్రివాడకు వరద ఉద్ధృతి భారీగా పెరిగింది.దీంతో అక్కడ ఉన్న జనాలు సురక్షిత ప్రాంతానికి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఈ క్రమంలోనే ఆ వరద ఉధృతిలో ఒక కుటుంబం వరద నీటిలో వెళ్తూ కనిపించింది.
వారి కష్టం చూస్తే సేమ్ బాహుబలి సీన్ ను తలపించింది.సినిమాలో బాబును కాపాడేందుకు శివగామి అక్కడే నిలబడి ఉండిపోగా రియల్ గా మాత్రం అందరూ కలిసి ముందుకు సాగారు.
పెద్ద ఎత్తున వచ్చిన వరద నీటిలో మూడు నెలల పసికందును బుట్టలో పెట్టుకుని వెళ్లారు.

ఒకరి తర్వాత ఒకరు మార్చుకుంటూ సురక్షిత ప్రాంతానికి చేరారు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మంథని పట్టణంలో వరద పరిస్థితి చాలా భయంకరంగా ఉంది.
ఈ వీడియో తెగ వైరల్ అవ్వడంతో ఈ వీడియోని చూసిన పలువురు అటువంటి ప్రదేశంలో వెంటనే తక్షణ చర్యలు చేపట్టి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించండి అంటూ కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు.







