టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్( Hero Prabhas ) గురించి మనందరికీ తెలిసిందే.ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు.
రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమా( Baahubali )తో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రభాస్.ప్రస్తుతం ప్రభాస్ ఎదురు రెండు మూడు పాన్ ఇండియా సినిమాలు ఉండగా అందులో ఇప్పటికే కొన్ని సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకున్నాయి.
ఇది ఇలా ఉంటే రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమాను ఆర్కా మీడియా( Arka Media ) పై నిర్మాత శోభు యార్లగడ్డ తెరకెక్కించిన విషయం తెలిసిందే.
అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు శోభు యార్లగడ్డ( Producer Shobu Yarlagadda ).ఆ సంగతి అటు ఉంచితే ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా ప్రభాస్ మైనం విగ్రహం కి సంబంధించి వార్తలు వినిపిస్తున్నాయి.ప్రపంచ ప్రఖ్యాత మాడమే తుస్సాద్ లో ప్రభాస్ ప్రభాస్ మైనపు బొమ్మను తయారు చేయగా ఇది పెద్ద ఎత్తున వైరల్ అవ్వడం స్టార్ట్ చేసింది.
మరి దీనిపై అయితే సినిమా నిర్మాత శోభు యార్లగడ్డ సీరియస్ అయ్యారు.అసలు ఇలా చేయడానికి వారు మమ్మల్ని సంప్రదించడం కానీ మా అనుమతి లాంటిది ఏమి తీసుకోలేదని తెలిపారు.
దీనిపై ఖచ్చితంగా యాక్షన్ తీసుకోబోతున్నాను అని కాస్త సీరియస్ గానే దీనిపై స్పందించారు.దీనితో శోభు ఊహించని రియాక్షన్ ప్రభాస్ ఫ్యాన్స్( Prabhas Fans ) కి షాకిచ్చింది.ఈ విషయంపై స్పందించిన కొందరు అభిమానులు కొందరు శోభుకి మద్దతు మద్దతుగా స్పందిస్తుండగా మరికొందరు వ్యతిరేకంగా స్పందిస్తున్నారు.అందులో తప్పేముంది దీనికి కూడా పర్మిషన్ కావాలా అంటూ మండిపడుతున్నారు.
ఇకపోతే ప్రభాస్ నటించిన సినిమాల విషయానికి వస్తే.ఇప్పటికే సినిమా షూటింగ్ని పూర్తిచేసుకున్న సలార్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
వీటితోపాటు ప్రభాస్ మరో రెండు సినిమాల్లో కూడా నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.