ఉప ముఖ్యమంత్రి పిఆర్ అండ్ ఆర్డిగా బాధ్యతలు చేపట్టిన బి.ముత్యాల నాయుడు

యాంకర్ ః  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయితీరాజ్ మరియుగ్రామీణాభివృద్ధిశాఖామాత్యులుగా బూడి ముత్యాల నాయుడు పదవీ బాధ్యతలు చేపట్టారు.అమరావతి సచివాలయం ఐదవ బ్లాకులో ప్రత్యేక పూజా కార్యక్రమం అనంతరం వేద పండితులు ఆశీర్వచనాల మద్ధ్య ఉప ముఖ్యమంత్రి పిఆర్ అండ్ ఆర్డిగా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు.

 B. Muthyala Naidu, Who Took Over As Deputy Chief Minister Pr & Rd , Deputy Chief-TeluguStop.com

జిల్లా పరిషత్ లను ఉమ్మడి జిల్లాల్లోనే కొనసాగించేందుకు సంబంధించిన దస్త్రంపై ఆయన తొలి సంతకం చేశారు.ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 9వేల 222 కి.మీల పొడవైన పంచాయితీ రాజ్ రోడ్ల మరమత్తులకు సంబంధించి 1072 కోట్ల రూ.లను మంజూరు చేస్తున్నట్టు ప్రకటిస్తూ త్వరలో టెండర్ల ప్రక్రియ ప్రారంభమం అవుతుందని తెలిపారు.ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి ఆశిస్సులతో నేడు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉందని చెప్పారు.స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని అన్ని విధాలా మెరుగుపర్చేందుకు తనవంతు కృషి చేస్తానని ముత్యాల నాయుడు స్పష్టం చేశారు.

జాతిపిత మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రామ,వార్డు సచివాలయాలు,గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు ద్వారా సరిపడిన సిబ్బందిని నియమించి ప్రభుత్వం అమలు చేస్తున్నఅభివృద్ధి సంక్షేమ పధకాలను గ్రామ స్థాయి వరకూ ప్రలందరికీ చేర్చేందుకు కృషి చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి బి.ముత్యాల నాయుడు పేర్కొన్నారు.తాను ఎంఎల్ఏ, మంత్రి కాకముందు గతంలో గ్రామ సర్పంచ్ గా,మండల పరిషత్ అధ్యక్షునిగా,జిల్లా పరిషత్ సభ్యునిగా పనిచేసిన అనుభవంతో గ్రామాల సర్వతో ముఖాభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని చెప్పారు.

ముఖ్యంగా గ్రామాల్లో తాగునీరు,పారిశుద్ద్యాన్ని మెరుగుపర్చేందుకు అన్ని విధాలా కృషి చేస్తానని అన్నారు.రానున్న రెండేళ్ళలో గ్రామాల సర్వతో ముఖాభివృద్ధికి అన్నివిధాలా కృషి చేస్తానని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల రాజు స్పష్టం చేశారు.

ఉప ముఖ్యమంత్రి పిఆర్ అండ్ ఆర్డీగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సెర్ప్ సిఇఓ ఇంతియాజ్,పంచాయితీరాజ్ శాఖ ఇంజనీరింగ్ చీఫ్ సుబ్బారెడ్డి,పంచాయితీరాజ్ శాఖ చీఫ్ ఇంజనీర్,ఇతర అధికారులు ఉప ముఖ్యమంత్రికి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.బైట్ ః ముత్యాలనాయుడు,ఉప ముఖ్యమంత్రి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube