నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాతో ఎలాగైనా ఈసారి అదిరిపోయే హిట్ అందుకోవాలని చూస్తున్నాడు బాలయ్య.
ఈ సినిమా కోసం చాలా గ్యాప్ తీసుకున్న బాలయ్య, అదిరిపోయే కథతో వస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమా పూర్తి కాకముందే బాలయ్య తన నెక్ట్స్ చిత్రాలను కూడా లైన్‌లో పెట్టే పనిలో పడ్డాడు.
బాలయ్యకు గతంలో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి ఇండస్ట్రీ హిట్స్ అందించిన దర్శకుడు బి.గోపాల్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.ఈ సినిమా కోసం ప్రముఖ రచయిత బుర్ర సాయి మాధవ్ ఓ పవర్‌ఫుల్ స్క్రిప్టును రెడీ చేశాడట.
ఒక్కసారి బాలయ్య ఈ కథను ఓకే చేస్తే, వెంటనే ఈ సినిమా పట్టాలెక్కడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.
మరి బాలయ్య ఈ సినిమాను ఎప్పుడు ప్రారంభిస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.