వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు విమర్శలు గుప్పించారు.ప్రధాని నరేంద్ర మోదీ సభలో మూడు రాజధానులపై స్లోగన్స్ ఇచ్చేలా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.
దీనిపై ఇప్పటికే డ్వాక్రా మహిళలతో రిహార్సల్స్ పూర్తి అయ్యాయని చెప్పారు.ప్రధాని హామీలపై విరుద్ధ ప్రకటనలు విచారకరమని వ్యాఖ్యనించారు.
రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ అంశాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ పెద్దలు పేదలకు ఇచ్చే బియ్యాన్ని కూడా వదలడం లేదని విమర్శించారు.
బ్లాక్ మార్కెట్ ద్వారా ఇతర దేశాలకు బియ్యం తరలిస్తున్నారని వెల్లడించారు.