మిషన్ వాత్సల్య పథకంపై అవగాహన

రాజన్న సిరిసిల్ల జిల్లా :మిషన్ వాత్సల్య పథకం పై బుధవారం ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ ఓగ్గు బాలరాజు యాదవ్ తల్లిదండ్రులు లేని పిల్లలకు మిషన్ వాత్సల్య పథకంపై అవగాహన కల్పించారు.

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం లోని కెసిఆర్ ఆత్మగౌరవ సముదాయంలో తల్లిదండ్రులను కోల్పోయిన గుండి మహేశ్వరి ,అంజి కుమారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన మిషన్ వాత్సల్య పథకం సద్వినియోగం చేసుకోవాలని దానికి సంబంధించిన వివరాలను వివరించారు.

ఈ నెల 15వ తేదీన చివరి తేదీగా ఉంటుందని సూచించారు .తల్లిదండ్రులు లేని పిల్లలందరూ ఇట్టి పథకంపై అవగాహన ఏర్పాటు చేసుకొని దరఖాస్తు చేసుకోవాలని గ్రామ సర్పంచ్ వెంకట్ రెడ్డి, ఉప సర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ తెలిపారు.గతంలో అంజి అనే అబ్బాయిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి చైల్డ్ కేర్ సంస్థ నుండి ఆర్థిక సహాయం చేయించినట్లు మాజీ ఎంపిటిసి ఓగ్గు బాలరాజు తెలియజేశారు.

ఈరోజు ఈ కార్యక్రమంలో అతనితో పాటుగా కేసీఆర్ ఆత్మగౌరవ కాలనీ ప్రధాన కార్యదర్శి సుంకి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన పరుచూరి!
Advertisement

తాజా వార్తలు