మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.కేసుపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని ఎనిమిదవ నిందితుడిగా చేర్చినట్లు భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ లో ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది.
హత్యకు కుట్ర, సాక్ష్యాల చెరిపివేతలో భాస్కర్ రెడ్డితో పాటు అవినాశ్ రెడ్డి ప్రమేయం ఉందని సీబీఐ ఆరోపించింది.దర్యాప్తును పక్కదారి పట్టించేలా తండ్రి, కుమారుడు ప్రయత్నిస్తున్నారన్న సీబీఐ సాక్ష్యాల ధ్వంసం వెనుక భారీ కుట్రపై దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించింది.
ఈ నేపథ్యంలో భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ కోర్టుకు విన్నవించింది.