డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న అవికాగోర్

చిన్నారి పెళ్ళికూతురు సీరియల్, ఊయ్యాల జంపాల సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన నార్త్ ఇండియన్ బ్యూటీ అవికాగోర్.ఈ అమ్మడు మొదటి సినిమాతో అందరికి ఆకట్టుకొని తన క్యూట్ లుక్స్ తో ఫ్యామిలీ టైప్ పాత్రలకి కేరాఫ్ గా మారింది.

 Avika Gor Digital Entry With Net Movie, Tollywood, Popcorn Movie, Tollywood Hero-TeluguStop.com

అయితే ఆరంభంలో కాస్తా ఒళ్ళు చేసిన ఈ అమ్మడు నిఖిల్ తో ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా తర్వాత రెండేళ్ళ పాటు టాలీవుడ్ కి దూరమైంది.ఆ సమయంలో వర్క్ అవుట్స్ చేసి స్లిమ్ లుక్ లోకి మారిపోయోయిన అవికా గోర్ మోడరన్ క్వీన్ గా, హాట్ బ్యూటీ అవతారం ఎత్తింది.

తన హాట్ ఫోటోషూట్ లతో టాలీవుడ్ దర్శకులని మళ్ళీ అలెర్ట్ చేసింది.దీంతో మళ్ళీ అవికా గోర్ కి అవకాశాలు పెరిగాయి.

Telugu Avika Gor, Net, Popcorn, Tollywood-Movie

ఏకంగా మెగా హీరో కళ్యాణ్ రామ్ కి జోడీగా నటించే అవకాశం ఈ బ్యూటీ సొంతం చేసుకుంది.రచయిత నుంచి దర్శకుడుగా మారిన శ్రీధర్ సీపాన దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది.అలాగే ఆదికి జోడీగా అమరన్ అనే థ్రిల్లర్ మూవీలో నటిస్తుంది.దీంతో పాటు తానే నిర్మాతగా మారి వేరొకరి భాగస్వామ్యంతో పాప కార్న్ అనే సినిమా చేస్తుంది.

ఈ సినిమాలో సాయి రోణక్ హీరోగా నటిస్తున్నాడు.ఇదిలా ఉంటే అవికా గోర్ ఇప్పుడు డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చేసింది.

తాజాగా ఆమె నెట్ అనే ఫిల్మ్ లో నటించింది.ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ ఆమె బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

థ్రిల్లర్ జోనర్ లో ఈ వెబ్ ఫిల్మ్ ఉంటుందని సమాచారం .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube