స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఇప్పటికే అంచనాలకు మించి గుర్తింపును సంపాదించుకున్నా కెరీర్ పరంగా మరింత ఎదిగే ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకూడదని రాజమౌళి భావిస్తున్నారు.ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న రాజమౌళి మహేష్ తో తెరకెక్కించే సినిమాతో తన ఖ్యాతిని మరింత పెంచుకోవాలని భావిస్తుండటం గమనార్హం.
జక్కన్నకు అవతార్ డైరెక్టర్ బంపర్ ఆఫర్ ఇచ్చారు.
రాజమౌళికి హాలీవుడ్ సినిమాలపై ఆసక్తి ఉంటే తన వంతు సహాయం చేస్తానని కేమరూన్ చెప్పారని సమాచారం.
ఆర్.ఆర్.ఆర్ సినిమా గురించి ప్రస్తావిస్తూ జక్కన్న ప్రతిభను జేమ్స్ కేమరూన్ తెగ పొగిడారని తెలుస్తోంది.నీరు నిప్పు కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఆ కాన్సెప్ట్ తనకు తెగ నచ్చిందని ఈ కాన్సెప్ట్ ను రివీల్ చేసిన విధానం అద్భుతంగా ఉందని జేమ్స్ కేమరూన్ వెల్లడించడం గమనార్హం.
ఆర్.ఆర్.ఆర్ లో గూస్ బంప్స్ సీన్లు ఎక్కువగానే ఉన్నాయని జక్కన్నకు జేమ్స్ కేమరూన్ చెప్పినట్టు సమాచారం.ఆర్.
ఆర్.ఆర్ బీజీఎం గురించి కూడా జేమ్స్ కేమరూన్ ప్రత్యేకంగా ప్రస్తావించారని బోగట్టా.రాబోయే రోజుల్లో రాజమౌళి కూడా హాలీవుడ్ సినిమాలపై దృష్టి పెట్టి మరిన్ని సంచలన ప్రాజెక్ట్ ల దిశగా అడుగులు వేస్తారేమో చూడాలి.రాజమౌళి దర్శకుడిగా తన స్థాయిని పెంచుకుంటున్న తీరు ఫ్యాన్స్ కు సైతం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
రాజమౌళి మహేష్ సినిమా తర్వాత తన గత సినిమాలలో ఏదో ఒక సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కించే అవకాశం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.జక్కన్న త్వరలో నిర్మాతగా మారబోతున్నారనే వార్త ఫ్యాన్స్ కు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది.రాజమౌళి తలచుకుంటే ఎన్నో రికార్డులను క్రియేట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి.హాలీవుడ్ ఆఫర్ కు ఒప్పుకుంటే జక్కన్న దశ తిరిగినట్టేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.