ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన అవసరాల శ్రీనివాస్ ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కీర్తి సురేష్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.చేసే పనిలో ఆనందం లేకపోతే అది కరెక్ట్ కాదని కీర్తి సురేష్ చెప్పుకొచ్చారు.
దేవానంద్ గారి గైడ్ సినిమా అంటే నాకు ఎంతో ఇష్టమని ఆయన తెలిపారు.మనం హాలీవుడ్ ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తూ చేయడం కంటే మన నేటివిటీ, మన కథలను మిస్ కాకుండా సినిమాలు చేస్తే బాగుంటుందని ఆయన తెలిపారు.
యాక్టింగ్ కు గుడ్ బై చెప్పాలని నేను ఎప్పుడూ అనుకోలేదని ఆయన అన్నారు.లీడ్ రోల్స్ ను నేను ఎక్కువగా రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయని ఆయన తెలిపారు.
మొహమాటాల వల్ల చేసిన కొన్ని సినిమాలు సైతం ఉన్నాయని అవసరాల శ్రీనివాస్ అన్నారు.ఫ్రెండ్స్ కొంతమంది సపోర్ట్ అడిగితే వాళ్ల కోసం చేయలసి వస్తుందని ఆయన తెలిపారు.
నేను షార్ట్ లిస్ట్ చేసిన పుస్తకాలను ఇంకా పూర్తి చేయలేదని ఆయన చెప్పుకొచ్చారు.
కోనవెంకట్ గారు మంచి రచయిత అని ఆయన కామెంట్లు చేశారు.
మహానటి సినిమాలో ఎల్వీ ప్రసాద్ గారి పాత్రలో నటించానని ఆయన కామెంట్లు చేశారు.

ఆ సినిమాలో నటించడం సంతోషంగా ఫీల్ అవుతున్నానని అవసరాల శ్రీనివాస్ అన్నారు.మహానటి సినిమాలో కీర్తి సురేష్ ను హీరోయిన్ గా కరెక్ట్ కాదని నేను అనుకున్నానని ఆయన తెలిపారు.అయితే మహానటి పాత్రకు ఆ అమ్మాయి భలే ఫిట్ అయ్యారని తర్వాత అనిపించిందని అవసరాల శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.

నిహారికతో ఒక సినిమా చేశానని నాగశౌర్య అడిగానని ఆయన తెలిపారు.నేను కూడా చాలామందిని ఫేవర్స్ అడుగుతూ ఉంటానని ఆయన చెప్పుకొచ్చారు.నేను చిన్న పాత్రలలో నటించడం వల్ల నా కెరీర్ కు నష్టం లేదని ఆయన తెలిపారు.అవసరాల శ్రీనివాస్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.