ఫలించిన జైశంకర్ కృషి ... భారతీయుల వీసా బ్యాక్‌లాగ్‌పై స్పందించిన ఆస్ట్రేలియా

భారతీయ విద్యార్ధులు, పౌరుల వీసా బ్యాక్‌లాగ్ సమస్యలపై ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత్‌కు హామీ ఇచ్చింది.ఈ ఏడాది చివరి నాటికి వీసా సమస్యను పరిష్కరిస్తామని ఆస్ట్రేలియా ప్రభుత్వం చెప్పినట్లు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మీడియాకు తెలిపారు.

 Australian Govt Assured On Resolved Problem Of Visa Backlog For Indians , Austra-TeluguStop.com

ముఖ్యంగా కరోనా కారణంగా స్వదేశంలో చిక్కుకుపోయి ఆస్ట్రేలియా వచ్చేందుకు ఇబ్బందులు పడుతోన్న భారతీయ విద్యార్ధులకు ఈ వీసా బ్యాక్‌లాగ్ సమస్య ఆందోళన కలిగిస్తోంది.ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా అక్కడి భారతీయ కమ్యూనిటీ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న డాక్టర్ ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.

వీసా బ్యాక్‌లాగ్ సమస్యపై ఆస్ట్రేలియా మంత్రులతో చర్చించినట్లు తెలిపారు.దాదాపు 77,000 మంది భారతీయ విద్యార్ధులు ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చారని.

ప్రస్తుతం పరిస్ధితి కాస్త మెరుగుపడిందని జైశంకర్ పేర్కొన్నారు.కానీ అక్కడక్కడా కొన్ని సమస్యలు వున్నాయని.

ఈ ఏడాది చివరి నాటికి వీసా బ్యాక్‌లాగ్ పరిష్కారమవుతుందని తాను చెప్పగలనని అన్నారు.

వీసా బ్యాక్‌లాగ్ అనేది కేవలం విద్యార్ధులకే కాకుండా.

పలు కుటుంబ సమస్యల కోసం స్వదేశంలో వుండి ఆస్ట్రేలియాకు వెళ్లాలనుకుంటున్న భారతీయులను కూడా ఆందోళనకు గురిచేస్తోందన్నారు జైశంకర్.ఆస్ట్రేలియన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ 2021 జనాభా లెక్కల ప్రకారం.

ఆస్ట్రేలియాలో ప్రవాస భారతీయుల సంఖ్య 7,00,000.వీరి సంఖ్య రానున్న రోజుల్లో భారీగా పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Telugu Australian, Indian, Indian Visa, Indians, Nanaia Mahuta, Zealand, Jaishan

ఇకపోతే.న్యూజిలాండ్ పర్యటనలోనూ భారతీయుల వీసా సమస్యలపై ఆ దేశ ప్రభుత్వంతో జైశంకర్ చర్చించిన సంగతి తెలిసిందే.దీనిలో భాగంగా గత గురువారం ఆ దేశ విదేశాంగ మంత్రి ననైయా మహుతాతో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా ఇండో పసిఫిక్, ఉక్రెయిన్ సంక్షోభం తదితర అంశాలపై ఇద్దరు నేతలు చర్చించారు.

అలాగే ఐక్యరాజ్యసమతి, కామన్‌వెల్త్ ఫోరమ్‌లలో ఇరుదేశాలు కలిసి ముందుకు సాగాలని నిర్ణయించారు.ఇదే సమయంలో భారతీయ విద్యార్ధుల వీసాల మంజూరు జాప్యంపై జైశంకర్ ప్రస్తావించారు.కోవిడ్ మహమ్మారి సమయంలో భారతీయ విద్యార్ధులు స్వదేశానికి వచ్చేశారని.తర్వాత వారు తిరిగి న్యూజిలాండ్ చేరుకునేందుకు వీసాలను పునరుద్ధరించలేదని కివీస్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు జైశంకర్.

విద్యార్ధులకు వీలైనంత త్వరగా వీసాలను మంజూరు చేసి చదువులు కొనసాగించేందుకు వీలు కల్పించాలని ఆయన కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube