ఐపీఎల్ మినీ వేలంలో ఈ ఆటగాడికి భారీ డిమాండ్..

ఆస్ట్రేలియా అంతర్జాతీయ క్రికెట్ లో మూడు ఫార్మేట్ లలో ఆడుతూ బిజీగా ఉన్న ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్.ఈ యువ ఆల్ రౌండర్ తన కెరీర్లో భీకరమైన ఫామ్ లో కొనసాగుతున్నాడు.

 Australia Cricketer Cameron Green Huge Demand For Ipl Auction Details, Australia-TeluguStop.com

ఆసీస్ క్రికెట్ టీం కు ఈ ఆల్ రౌండర్ అవసరం ఉందని, అతనిపై ఎక్కువగా ప్రెజర్ పడకుండా చూసుకోవాలని టెస్ట్ కెప్టెన్ పాట్ కమిన్స్ వెల్లడించాడు.డిసెంబరు 2020 నుంచి ఆసీస్ తరఫున 14టెస్టులు, 12వన్డేలు, 4 టీ20లు ఆడిన 23ఏళ్ల గ్రీన్ 1000పరుగులు చేసి, 30 వికెట్లు కూడా తీశాడు.టీ20ల్లో గ్రీన్ దాదాపు 194 స్ట్రైక్ రేట్‌తో 120పరుగులు చేశాడు.19బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి మూడో టీ20ల్లో భారత బౌలర్లపై విరుచుకు పడిన సంగతి తెలిసిందే.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో గ్రీన్ కోసం కాసుల వర్షం కురిసే అవకాశం ఉందని కమిన్స్ చెప్పాడు.ఐపీఎల్లో ఆడడం గురించి మీరు ఎవరినీ నిందించలేరు.అతను ఎక్కడ ఆడినా అతనికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది.అతను ఏ లీగ్ ఆడాలో ఏదీ వద్దో నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ అతనికే ఉంటుందని కామెంట్స్ అభిప్రాయపడ్డాడు.

గ్రీన్ ఎలాంటి గాయాల బారిన పడకుండా క్రికెట్ రెండు సంవత్సరాల నుంచి ఆడుతూ ఉన్నాడు.ప్రస్తుతం అతను మూడు ఫార్మాట్లలో క్రికెట్ ఆడుతూ బిజీగా ఉన్నాడు.

గ్రీన్ నిరంతరం ఎక్కువగా క్రికెట్ ఆడటాన్ని ఇష్టపడతాడు.అయితే భీకరమైన ఫామ్ లో ఉన్న కామెరాన్ గ్రీన్ ఆస్ట్రేలియా టి20 ప్రపంచ కప్ టీం లో మాత్రం సెలెక్ట్ కాలేదు.ఏ ఆటగాడైనా గాయపడితే అతన్ని సెలెక్ట్ చేసే అవకాశం కూడా ఉంది.కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో జరిగిన సిరీస్ డిసైడర్ మ్యాచ్ లో ఇండియా పై కామెరాన్ గ్రీన్ 19బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఇండియాపై ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు.మ్యాక్స్ వెల్, వార్నర్ తర్వాత 19బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా కూడా నిలిచాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube