ఏడాదిలోగా మనవడిని కనాలి.. లేకుంటే రూ.5 కోట్లు ఇవ్వాలంటూ కోడలిపై పిటిషన్ వేసిన అత్త!

తాజాగా ఒక అత్తయ్య తన కోడలిపై వింత పిటిషన్ వేసింది.బహుశా న్యాయవ్యవస్థలో ఇలాంటి పిటిషన్ వేయడం ఇదే తొలిసారేమో! తన కోడలు,కొడుకులు కలిసి ఏడాదిలోగా మనవడు లేదా మనవరాలును తనకి కనివ్వాలని ఆమె డిమాండ్ చేస్తోంది.

 Aunt Who Filed A Petition Against Daughter In Law To Give Her Grandson Within A-TeluguStop.com

ఆమె ప్రకారం, కొడుకు కోడలు డబ్బు యావలో పడి పిల్లలను కనేందుకు ఏమాత్రం ఆసక్తి కనబరచడం లేదట.పైగా కొడుకు తన భార్యతో కలిసి తల్లికి దూరంగా ఉంటున్నాడట.

అయితే ఎంతో గారాబంగా పెంచుకున్న కొడుకును కోడలు దూరం చేయడంతో తాను ఎంతో మానసిక క్షోభకు గురయ్యానని ఆమె అంటోంది.తన కొడుకు, కోడలు మనవడు లేదా మనవరాలకు జన్మనిచ్చేందుకు నిరాకరిస్తున్నారని ఆమె హరిద్వార్‌లోని సివిల్ కోర్టును ఆశ్రయించింది.

తమ మానసిక వేదనకు పరిహారం పొందేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆమె ఒక పిటిషన్ దాఖలు చేసింది.

ఈ అత్త తన లాయర్ ఎ.కె శ్రీవాస్తవ ద్వారా కొడుకు, కోడలుపై రూ.5 కోట్ల దావా కోర్టులో దాఖలు చేసింది.తన కుమారుడి చదువు కోసం చాలా డబ్బు ఖర్చు చేసానని ఆమె చెబుతోంది.అంతే కాదు, కొడుక్కి నచ్చినట్లుగా అతన్ని పైలట్‌గా చేశానని ఆ మహిళ తన పిటిషన్‌లో పేర్కొంది.2016లో తన కుమారుడి పెళ్లిని చాలా డబ్బుతో ఘనంగా జరిపించాలని.తన సొంత డబ్బులతోనే వారిని హనీమూన్‌కి థాయ్‌లాండ్‌కు కూడా పంపించానని ఆమె వెల్లడించింది.

Telugu Civil Haridwar, Grandson, Ak Srivastava, Rs Crore, Latest-Latest News - T

అయితే పెళ్లి తర్వాత, కోడలు తన కొడుకును హైదరాబాద్‌కు మాకం మార్చాలని బలవంతం చేసిందని ఆమె ఆరోపించింది.అప్పటి నుండి తన కొడుకు, కోడలు అస్సలు మాట్లాడటం లేదని ఆమె వాపోయింది.కోడలు కుటుంబం తన కొడుకు జీతం మొత్తం తీసుకుంటుందని… ప్రతి నిర్ణయంలో వారి కుమార్తెకే మద్దతు ఇస్తుందని ఆమె తన పిటిషన్ లో చెప్పుకొచ్చింది.కొడుకు, కోడలు ఏడాదిలోపు బిడ్డను కనేలా ఆదేశించాలని, లేకుంటే వారు రూ.5 కోట్ల నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోర్టులో ఆమె దావా వేసింది.అయితే కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube