2019 ఎన్నికలలో గోపాలపురం నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన తలారి వెంకట్రావు పై ఈరోజు ఉదయం గ్రామస్థులు దాడి చేశారు.జి కొత్తపల్లి గ్రామంలో మొదటి నుండి వైసీపీ పార్టీలో రెండు వర్గాలు ఉన్నాయి.
ఈ క్రమంలో వైసీపీ గ్రామ అధ్యక్షుడిగా ఉన్న గంజి ప్రసాద్ ఈరోజు ఉదయం దారుణ హత్యకు గురయ్యారు.అయితే గ్రామంలోని ప్రసాద్ వ్యతిరేక వర్గమే ఆయనను హత్య చేయించిందని.
ఆయన వర్గీయులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఇదే సమయంలో ప్రసాద్ వ్యతిరేక వర్గాన్ని స్వయంగా ఎమ్మెల్యే ప్రోత్సహించారని కూడా చెప్పుకొస్తున్నారు.
ఇటువంటి తరుణంలో ప్రసాద్ మృతి నేపథ్యంలో.ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చిన ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పై గ్రామస్థులు మూకుమ్మడిగా దాడికి దిగారు.
మనిషి చనిపోతే గాని క్యాడర్ గుర్తు రాలేదా అంటూ ఎమ్మెల్యేపై తిరగబడ్డారు.పోలీసులు అడ్డుకున్న గాని.
గ్రామస్తులు ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పై ఒక్కసారిగా దాడికి దిగారు.ఈ దాడిలో వైసీపీ ఎమ్మెల్యేకి కొద్దిపాటి గాయాలయ్యాయి.
గ్రామస్తులంతా ఒక్కసారిగా ఎమ్మెల్యే మీద దాడి చేయడం.తో పోలీసులు కూడా కంగుతిన్నారు.