విజయవాడ( Vijayawada )లో కుట్ర ప్రకారమే సీఎం జగన్( CM Jagan ) పై దాడి జరిగిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.సీఎం జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేక కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
జగన్ ను హతమార్చాలనే కుట్ర చంద్రబాబు( Chandrababu ) చేస్తున్నారని అంబటి రాంబాబు తెలిపారు.జగన్ ఏనాడూ సానుభూతి కోసం ప్రయత్నించలేదని పేర్కొన్నారు.అధికారం పోయిందంటే చంద్రబాబు సహించలేకపోతున్నారని విమర్శించారు.రాష్ట్రంలో చంద్రబాబు హింసను ప్రోత్సహిస్తున్నారన్న అంబటి రాంబాబు( Ambati Rambabu ) అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారని ఆరోపణలు చేశారు.
విజయవాడ మీ అడ్డా అనుకుంటున్నారా అని ప్రశ్నించిన అంబటి పవన్ సినిమా యాక్టర్ అని చూసేందుకు వస్తున్నారన్నారు.జగన్ పై దాడిని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించారని తెలిపారు.