ఇజ్రాయెల్‌ పై ఇరాన్ డేంజర్ మిస్సైల్స్‌...డ్రోన్ లతో దాడి..!!

ఇజ్రాయెల్‌ పై( Israel ) 48 గంటలలో దాడి చేస్తామని ఇరాన్( Iran ) ప్రకటించడం జరిగింది.ఈ క్రమంలో శనివారం ఇజ్రాయెల్‌ పై ఇరాన్ దాడులు ప్రారంభించింది.

 Attack On Israel With Irans Dangerous Missiles Drones Details, Iran, Israel, Ira-TeluguStop.com

దాదాపు రెండు వందలకుపైగా డ్రోన్స్‌, మిస్సైల్స్‌ ప్రయోగించి ఇజ్రాయెల్‌ పై విరుచుకుపడింది.దీంతో పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది.

మరోపక్క ఇరాన్ చేసిన దాడికి కచ్చితంగా మూల్యం చెల్లించుకుంటుందని ఇజ్రాయెల్‌ హెచ్చరించడం జరిగింది.ఇరాన్ నుంచి వచ్చే డ్రోన్స్( Drones ) ఇజ్రాయెల్‌ కి చేరుకోవటానికి గంటలకు సమయం పట్టి అవకాశం ఉందని ఖచ్చితంగా తాము ఎదుర్కొంటామని.

ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది.

ఇరాన్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌ కు అమెరికా( America ) మద్దతు తెలిపింది.ఇజ్రాయెల్‌ దేశానికి సమీపంగా క్షిపణి విధ్వంసక యుద్ధనౌకలను మోహరించింది.కాగా ఇరాన్ దాడి( Iran Attack ) చేయడంతో.

ఆదివారం రాత్రి లేదా సోమవారం.ఇజ్రాయెల్‌ సైన్యం ప్రతి దాడి చేయడానికి సిద్ధం కావడం జరిగింది.మరోపక్క ఈ రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పటానికి ప్రపంచ అగ్రదేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.ఇజ్రాయెల్‌… ఇరాన్ దేశాల యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి( Third World War ) కారణం అవ్వోచ్చు అని భావిస్తున్నాయి.ఇక ఇదే సమయంలో భారత ప్రభుత్వం…ఇజ్రాయెల్‌.ఇరాన్ దేశాలలో ఉన్న పౌరులను అప్రమత్తం చేయడం జరిగింది.ఇప్పటికే ఆ రెండు దేశాలకు వెళ్లొద్దని భారత విదేశాంగ శాఖ ప్రకటన కూడా విడుదల చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube