అమెరికాలో దుండగులు రెచ్చిపోయారు.హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థిపై చికాగోలో దుండగులు దాడి చేయడం జరిగింది.
చికాగోలోని ఇండియన్ వెస్లీయన్ విశ్వవిద్యాలయం( Indian Wesleyan University ) లో చదువుతున్న సయ్యద్ మజాహిర్ ఆలీ అనే విద్యార్థి పై నలుగురు దుండగులు విచక్షణారహితంగా దాడి చేయడం జరిగింది.దీంతో సదరు విద్యార్థి తలపై మరియు ముక్కు, నోరు తీవ్ర గాయాలు అయ్యాయి.
దుండగుల దాడిలో తీవ్ర గాయాలైన సయ్యద్ మజాహిర్ ఆలీ తనని కాపాడాలంటూ ఇండియన్ ఎంబసీ అధికారులకి( Indian Embassy ) ఫోన్ చేయడం జరిగింది.
ఇదే సమయంలో హైదరాబాదులో విద్యార్థి తల్లిదండ్రులు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్( Minister of External Affairs of India Jai Shankar ) దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.తమ కుమారుడిని కాపాడాలంటూ సయ్యద్ మజాహిర్ ఆలీ కుటుంబ సభ్యులు కేంద్రమంత్రికి లేఖ కూడా రాయడం జరిగింది.అమెరికాలో ఇటీవల దుండగులు ఉన్న కొద్ది రెచ్చిపోతున్నారు.
అర్ధరాత్రి అయితే చాలు ఒంటరిగా కనిపిస్తే దోచుకోవడానికి ప్రాణాలు తీయడానికి కూడా ఏమాత్రం ఆలోచించడం లేదు.ఇప్పటికే ఈ రకంగా అనేక సందర్భాలలో భారతీయ విద్యార్థులపై దాడులకు( Indian Students ) పాల్పడటం జరిగింది.
అయితే తాజాగా సయ్యద్ మజాహిర్ ఆలీపై ఏకంగా నలుగురు చాలా దారుణంగా దాడులకు పాల్పడటం జరిగింది.ఆ నలుగురు దుండగులు నుండి సయ్యద్ పారిపోయే ప్రయత్నం చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.