కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యేపై దాడి జరిగింది.చిక్ మంగళూరులో ఎమ్మెల్యే కుమారస్వామిని గ్రామస్థులు కొట్టినట్లు తెలుస్తోంది.
ఇటీవల హుల్లేమేన్ గ్రామానికి చెందిన ఓ మహిళ ఏనుగు దాడిలో మృతిచెందింది.ఈ నేపథ్యంలో మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఎమ్మెల్యే వెళ్లారు.
అయితే ఏనుగుల సంచారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలుమార్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.ఎమ్మెల్యే నిర్లక్ష్యం కారణంగానే మహిళ చనిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో తీవ్ర కోపానికి గురైన గ్రామస్థులు ఎమ్మెల్యేపై దాడి చేసి దుస్తులు చించివేశారని సమాచారం.