షాద్ నగర్ లో దారుణం.. పసి బిడ్డను కొని, తల్లిని హతమార్చిన దంపతులు..!

మగ సంతానం లేని దంపతులు మధ్యవర్తి ద్వారా ఓ మగ బిడ్డను కొనుగోలు చేశారు.అయితే కన్నబిడ్డ అంటే మమకారం ఉండని తల్లి అనేదే ఉండదు.

 Atrocity In Shad Nagar Couple Who Bought A Baby Girl And Killed The Mother , Mah-TeluguStop.com

ఈ క్రమంలో కడుపు తీపి పట్టలేక బిడ్డ కోసం వచ్చిన ఆ తల్లిను, ఆ దంపతులు దారుణంగా హత్య చేశారు.ఈ ఘటన హైదరాబాద్ కు కూత వేటు దూరంలో ఉండే షాద్ నగర్ లో చోటుచేసుకుంది.

ఈ హత్య ఘటనకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.వివరాల్లోకెళితే.

మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం కొర్ర తండా కు చెందిన సభావత్ రాములు( Sabavath Ramulu ) కుటుంబ సభ్యులతో కలిసి షాద్ నగర్లో నివాసం ఉంటున్నాడు.రాములుకు ఒక కుమార్తె సంతానం.

మగసంతానం లేని కారణంగా ఈ దంపతులు ఓ మగ బిడ్డను కొని పెంచుకోవాలి అనుకున్నారు.ఈ విషయాన్ని ఇంటి పక్కనే ఉన్న బీహార్ కు చెందిన పురుషోత్తం( Purushottam ) అనే వ్యక్తితో చెప్పారు.

ఈ క్రమంలో పురుషోత్తం తన రెండవ భార్య దేవకికి( Devaki ) ఒక కుమారుడు ఉన్నాడు కొంటారా అని ఆ దంపతులను అడిగాడు.రాములు వెంటనే కొనడానికి ముందుకు రావడంతో దేవకి కుమారుడిని ఐదు నెలల క్రితం రూ.1.5 లక్షలకు పురుషోత్తం అమ్మేశాడు.దేవకి కన్న కొడుకు పై మమకారం చంపుకోలేక తరచూ రాములు ఇంటికి వచ్చి తన కుమారుడిని చూసుకునేది.అయితే దేవకితమ ఇంటికి రావడం నచ్చని రాములు దంపతులు పలుమార్లు ఆమెతో గొడవ పడ్డారు.

ఎలాగైనా దేవకిని వదిలించుకోవాలంటే హత్య చేయడం ఒకటే మార్గమని రాములు భావించాడు.సోమవారం రాత్రి కూడా దేవకి రాములు ఇంటికి వచ్చి కొడుకు కోసం గొడవ పడింది.

రాములు, జ్యోతి ఇదే మంచి అవకాశం అని దేవకి ఇంట్లోకి రాగానే గొంతు నులిమి దారుణంగా చంపేశారు.దేవకి మృతదేహాన్ని గోనే సంచిలో కట్టి షాద్ నగర్ లోని బుచ్చిగూడా రోడ్డులో పడేసేందుకు వెళుతుండగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.

పోలీసుల ముందట రాములు, జ్యోతి తాము చేసిన నేరాన్ని అంగీకరించారు.నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube