ముంబై( Mumbai ) నగరంలో ఆటోలో వెళుతూ గొడవపడ్డ ప్రేమికులు.క్షణికావేశంలో ప్రియుడు తన ప్రియురాలిని గొంతు కోసి హత్య చేశాడు.
ఈ ఘటనతో నగరం అంతా తీవ్ర కలకలం రేగింది.అసలు వివరాలు ఏమిటో చూద్దాం.
వివరాల్లోకెళితే.ముంబై నగరంలోని సాకి నాకా కు చెందిన పంచశీల జమ్ధర్ (30), అదే ప్రాంతానికి చెందిన దీపక్ బోర్సే (28) తో గత రెండు సంవత్సరాలుగా రిలేషన్ షిప్ కొనసాగిస్తుంది.
అయితే దీపక్ ఉల్హాస్ నగర్( Ulhasnagar ) నివాసి, సాకి నాకా కు చెందిన పంచశీల చండీవాలిలోని సంఘర్ష్ నగర్ లో నివసిస్తుంది.సోమవారం సాయంత్రం దీపక్ ఘాట్ కోపర్ రైల్వే స్టేషన్ కు వచ్చాడు.
ఇతనిని పికప్ చేసుకోవడానికి పంచశీల రైల్వేటేషన్ కు వచ్చింది.

వీరిద్దరూ సాకి నాకా వైపు వెళ్లడానికి ఆటో రిక్షా ఎక్కారు.అయితే వీరి మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు జరుగుతూ ఉండేవి. ఆటోలో వెళుతూ మాటల మధ్యలో చిన్న గొడవ మొదలైంది.
దీపక్ ఆగ్రహానికి లోనై తన జేబులో ఉండే కట్టర్ తీసి ముందుగా పంచశీలను బెదిరించాడు.గొడవ మరింత పెరగడంతో పంచశీల మెడను కట్టర్ తో కోసి ఆ తర్వాత ఆటో దిగి అక్కడి నుంచి పారిపోయాడు.
తర్వాత పంచశీల తీవ్ర గాయాలతో ఆటోలోంచి దిగి పరిగెత్తే ప్రయత్నం చేసి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

ఈ ఘటన సోమవారం 4:30 గంటల సమయంలో జరిగింది.అటువైపు వెళుతున్న వాహనదారులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించగా సాకి నాకా నుండి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.పంచశీలను రాజావాడి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు.
ఇక పారిపోతున్న దీపక్ పై రక్తపు మరకలు కనిపించడంతో స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.దీపక్ తప్పించుకునేందుకు మొదట పంచశీల తనపై దాడి చేసిందని కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాడు.
కానీ ఆటో రిక్షా డ్రైవర్ సాక్షిగా నిలిచి దీపక్ చేసిన దారుణాన్ని వాంగ్మూలం గా ఇవ్వడంతో దీపక్ జరిగిందంతా పోలీసులకు వివరించాడు.పోలీసులు ( Police )హత్య కేసు నమోదు చేసి ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేదంటే క్షణికావేశంలో జరిగిందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
అయితే దీపక్ తన వెంట కట్టర్ తీసుకెళ్లడానికి ప్రధాన కారణం ఏంటని పోలీసులు విచారిస్తున్నారు.