ఏటీఎం కార్డులు అందుబాటులోకి వచ్చాక బ్యాంకులకు వెళ్లి నగదు లావాదేవీలు జరిపే అవసరం తగ్గింది.నేటి కాలంలో అందరూ ఏటీఎం కార్డులు వాడుతున్నారు.
ఏటీఎం కార్డులు వచ్చాక చాలా అంశాలు సులభతరం అయ్యాయి.ఏటీఎం కార్డులను ఉపయోగించి బ్యాంకు వినియోగదారులు సులభంగా డబ్బు తీసుకోవచ్చు.
ఆన్‌లైన్ షాపింగ్ చేయవచ్చు.ఏటీఎం కార్డ్ పిడికిలిలో పట్టేంత చిన్నదిగానే ఉండవచ్చు, కానీ ఇది ఎంతో క్లిష్టమైన సాంకేతికతతో పని చేస్తుంది.
బయటి నుండి చూస్తే ఇది సాధారణ ప్లాస్టిక్ కార్డుగానే కనిపిస్తుంది.దాని లోపల కూడా అలానే ఉంటుందని చాలామంది అనుకుంటారు.
దాని గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాలని అనుకోరు.అయితే ఎటీఎం కార్డులోపల అనేక సాంకేతిక అంశాలు ఉన్నాయి.
బయటి నుండి సాధారంగంగా కనిపించే ఈ ఏటీఎం కార్డ్ లోపల క్లిష్టమైన సాంకేతికత ఉంటుంది.ఏటీఎం తయారీలో ప్రత్యేక సాంకేతికతను ఉపయోగిస్తారు.
ఈ సాంకేతికత కారణంగా కార్డు అదుబాటుతో కాంటాక్ట్‌లెస్ చెల్లింపులు సులభతరం అవుతాయి.
ఆ టెక్నాలజీ గురించి, ఏటీఎం లోపల ఎటుంటి సాంకేతిక అంశాలు ఉంటాయో ఇప్పుడుతెలుసుకుందాం.
డెబిట్ కార్డ్‌లు లేదా ఏటీఎం కార్డుల సాయంతో కాంటాక్ట్‌లెస్ చెల్లింపులు చేయడానికి రేడియో-ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ సాంకేతికత ఉపయోగిస్తారు.ఈ సాంకేతికత కార్డు ద్వారా చెల్లింపులు చేసే సౌలభ్యాన్ని అందిస్తుంది.
ఈ టెక్నాలజీలో ఏటీఎం కార్డులో చిప్‌ని అమరుస్తారు.ఏటీఎంను కార్డ్ రీడర్ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఈ చిప్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది.
కార్డ్ రీడర్ నుండి వచ్చే సిగ్నల్ చిప్‌ను యాక్టివేట్ చేస్తుంది.ఏటీఎం కార్డులోని ఎంబెడెడ్ యాంటెన్నా కూడా దానిని యాక్టివ్ చేయడానికి ఉపయోగపడుతుంది.

ఈ యాంటెన్నా డిస్‌కనెక్ట్ అయితే, డెబిట్ కార్డ్‌లోని చిప్ కూడా ఏమాత్రం పనిచేయదు.ఫలితంగా మీ కార్డ్ నుండి మీరు చెల్లింపు చేయడం సాధ్యం కాదు.కొందరు వ్యక్తులు ఏటీఎం కార్డును మధ్య నుంచి పగలగొట్టి చూడగా అందులో చిప్‌తోపాటు యాంటెన్నా ఉన్నట్లు గుర్తించారు.ఈ యాంటెన్నా సన్నని రాగి తీగతో తయారయి ఉంటుంది.
ఇది కార్డ్ లోపల మాత్రమే ఉంటుంది.బయటి నుండి కనిపించదు.
ఈ కాపర్ వైర్ యాంటెన్నా డెబిట్ కార్డ్‌లో పొందుపరిచిన చిప్‌ని యాక్టివేట్ చేయడానికి పని చేస్తుంది.మీ పాత ఏటీఎం కార్డు పగలగొట్టి చూస్తే, ఈ యాంటెన్నా వైర్ ఖచ్చితంగా మీకు కనిపిస్తుంది.
ఇప్పుడు మీకు ఏటీఎం కార్డులోని సాంకేతికత గురించి అర్థమై ఉంటుంది.







