ఇప్పటి వరకు తెలుగు లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్స్ అన్నిట్లో మోస్ట్ లక్కీయస్ట్ కంటెస్టెంట్ ఎవరు అంటే కళ్ళు మూసుకొని ఆట సందీప్( Ata Sandeep ) పేరు చెప్పేయొచ్చు.ఈ సీజన్ లో ఒక టాప్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్న ఆయన వరుసగా 7 వారాలు నామినేషన్స్ నుండి తప్పించుకున్నాడు.
పవర్ అస్త్ర టాస్కులో గెలుపొంది 5 వారాలు నామినేషన్స్ నుండి ఇమ్యూనిటీ సంపాదించుకున్న సందీప్, ఆరవ వారం గౌతమ్( Gautam ) సేవ్ చెయ్యడం, అలాగే ఈ వారం నామినేషన్స్ లో ఆయనకీ కేవలం ఒకే ఒక్క ఓటు రావడం తో ఈ వారం కూడా నామినేషన్స్ నుండి తప్పించేసుకున్నాడు.ఇప్పుడు ఈ వారం జరిగిన కెప్టెన్సీ టాస్కు లో కూడా ఆయనే చివరికి గెలిచాడని, ఆయనే కెప్టెన్ అయ్యాడని తెలుస్తుంది.
అంటే వచ్చే వారం కూడా నామినేషన్స్ నుండి సందీప్ సేఫ్ అన్నమాట.ఇలా వరుసగా 8 వారాలు బిగ్ బాస్ నామినేషన్స్ నుండి తప్పించుకున్న ఏకైక కంటెస్టెంట్ గా సరికొత్త రికార్డు ని నెలకొల్పాడు సందీప్.

ఈ వారం కెప్టెన్సీ టాస్కులో( Captaincy Task ) భాగంగా బిగ్ బాస్ హౌస్ మేట్స్ ని గులాబిపురం టీం మరియు జిలేబి పురం టీం అని రెండు భాగాలుగా విభజించాడు.ఈ టాస్కు మొత్తం స్కిట్స్ తో ప్రేక్షకులను బాగా అలరించింది.అనంతరం ఎగ్ సేవింగ్ టాస్కులో జిలేబీపురం టీం( Jilebipuram Team ) విజయం సాధించింది.నిన్నటితో ఈ టాస్కులోని మొదటి అంకం పూర్తి అవ్వగా, నేటి నుండి రెండవ అంకం ప్రారంభం కానుంది.
అలా చివరికి అన్నీ రౌండ్స్ అయిపోయాక జిలేబీపురం టీం గెలిచిందని.వీరిలో సందీప్ మూడవ కెప్టెన్ గా ఎంపిక అయ్యాడని టాక్ వినిపిస్తుంది.ఈ ఎపిసోడ్ రేపు టెలికాస్ట్ కాబోతుంది.అయితే సందీప్ కి ఇప్పటి వరకు నామినేషన్స్ లోకి రాకపోవడం వల్ల ఆయనకీ ఫ్యాన్ బేస్ ఫామ్ కాలేదని.
నామినేషన్స్( Nominations ) వచ్చిన వారం లో ఆయన ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

అయితే ముందు వారాలతో పోలిస్తే ఈ వారం సందీప్ ఆట బాగా ఇంప్రూవ్ అయ్యిందనే చెప్పాలి.టాస్కులు బాగా ఆడుతున్నాడు.ప్రతీ వారం నాగార్జున చెప్పే తప్పులను లెక్కలోకి తీసుకొని సరిచేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇలాగే ఆయన తన గేమ్ ని మెరుగు పర్చుకుంటూ పోతే భవిష్యత్తులో కచ్చితంగా టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలుస్తాడని అంటున్నారు విశ్లేషకులు.ప్రస్తుతానికి అయితే టాప్ 5 లో ఉండే కంటెస్టెంట్స్ శివాజీ, యావర్, అమర్ దీప్ , అర్జున్ మరియు పల్లవి ప్రశాంత్.
వీరిలో ఎవరినో ఒకరిని రీప్లేస్ చేసేంత సత్తా సందీప్ కి ఉందో లేదో రాబొయ్యే రోజుల్లో తెలుస్తుంది.