యంగ్ హీరో నాగశౌర్య నటించిన తాజా చిత్రం అశ్వధ్ధామ జనవరి 31న రిలీజ్ అయ్యింది.ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ మొదలుకొని టీజర్, ట్రైలర్లతో ప్రేక్షకులను అలరించడంల సక్సెస్ అయ్యింది.
ఇక ఈ సినిమాకు కథ కూడా నాగశౌర్య అందించడంతో ఈ సినిమా ఎలా ఉంటుందా అని ఆసక్తిగా చూశారు ప్రేక్షకులు.కట్ చేస్తే, సినిమా రిలీజ్ అయ్యి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.
ఇక ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కడంతో ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు.ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాలో హీరోయిన్‌గా అందాల భామ మెహ్రీన్ పీర్జాదా నటించింది.
ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించిన జిషు సెన్ గుప్తా తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను మెప్పించాడు.ఈ సినిమా తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ కలెక్షన్లు సాధించింది.
తొలిరోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.0.80 కోట్ల మేర వసూళ్లు సాధించింది.ఏరియాల వారీగా ఈ సినిమా కలెక్ట్ చేసిన వసూళ్లు ఈ విధంగా ఉన్నాయి.
నైజాం – 29 లక్షలు
సీడెడ్ – 8 లక్షలు
గుంటూరు – 6.2 లక్షలు
ఉత్తరాంధ్ర – 14 లక్షలు
ఈస్ట్ – 7 లక్షలు
వెస్ట్ – 5.04 లక్షలు
కృష్ణా – 7.7 లక్షలు
నెల్లూరు – 3 లక్షలు
టోటల్ ఏపీ+తెలంగాణ – 0.80 కోట్లు